శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (17:56 IST)

నవ్విస్తూ భయపెట్టే ‘బొమ్మ అదిరింది’: రితిక చక్రవర్తి

దర్శకుడితో నో బేడ్‌మూవ్‌మెంట్‌

Bomm Adirindi dimma tirigindi, Ritika
కొల్‌కత్తానుంచి వచ్చి తెలుగులో మొదటి సినిమా చేసిన 19 ఏళ్ళ నటి రితిక చక్రవర్తి. షకల‌క శంకర్‌ హీరోగా నటించిన చిత్రం ‘బొమ్మ అదిరింది’’ దిమ్మ తిరిగింది’ కుమార్‌ కోట దర్శకుడు. మహంకాళి మూవీస్‌, మహంకాళి దివాకర్‌ సమర్పణలో, మణిదీప్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై లుకాపు మధు, సోమేశ్‌ ముచర్ల నిర్మాతలుగా దత్తి సురేష్‌ బాబు నిర్మాణ నిర్వహణలో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో శంకర్‌కు భార్యగా నటించిన రితిక తన షూటింగ్‌ అనుభవాను తెలియజేస్తుంది.
 
- నాకు మోడలింగ్‌ అంటే ఇష్టం. నీరూస్‌, ముగ్ధాస్‌.. వంటివి చేశాను. మోడలింగ్‌కూ సినిమాకు చాలా తేడా వుంది. మొదటి రోజు కాస్త భయపడ్డాను. తెలుగు రాదు. షకల‌క శంకర్‌ చాలా సరదాగా వుండేవాడు. దర్శకుడు కూడా అర్థంకాని డైలాగ్స్‌ను వివరించేవారు. దర్శకుడి నుంచి నో బేడ్‌మూవ్‌మెంట్స్‌, యూనిట్‌ అంతా ప్రొఫెష‌నల్స్‌గా చేశారు. సెట్లో అంతా సరదాగా వుంది.
 
` ఈ సినిమా రొమాంటిక్‌, హారర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌. ఇందులో గృహిణి సుజి పాత్రలో నటించాను. షకల‌క శంకర్‌ భార్యగా కనిపిస్తాను. డైరెక్టర్‌ కుమార్‌ కోట మొదటి సినిమా అయినా చాలా కష్టపడి పని చేశారు. షకల‌క శంకర్‌, దర్శక, నిర్మాత సహకారం మరచిపోలేము. మేమందరం ఫ్యామిలీ ట్రిప్‌కి వెళ్లి వచ్చినట్లు సినిమాను పూర్తి చేయగలిగాం. మేమంతా ఈ సినిమా  విడుదల‌ కోసం ఎదురుచూస్తున్నాం.
 
` ఈ సినిమాలో చిన్న హర్రర్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయి. ఆడియన్స్‌ వాటిని బాగా ఎంజాయ్‌ చేస్తారు. నేను నటించిన మొదటి సినిమా అయినా సెట్స్‌లో అందరూ నాకు బాగా సపోర్ట్‌ చేశారు. తెలుగులో నేను ఒక మంచి సినిమాతో పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా చేస్తున్నపుడు కొన్ని సినిమా ఆఫర్లు వచ్చాయి. త్వరలో వాటి వివరాలు తెలుపుతాను` అన్నారు.