ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (12:41 IST)

AnushkaSharma అనుష్కశర్మ-విరాట్ కోహ్లిల ముద్దుల కుమార్తె పేరు వామికా, ఫస్ట్ పిక్ షేర్

ఫోటో కర్టెసీ-ఇన్‌స్టాగ్రాం
అనుష్క శర్మ- విరాట్ కోహ్లీ తమ ముద్దుల కుమార్తెకు వామికా అని పేరు పెట్టారు. గత నెలలో తమ కుమార్తె జన్మించిన తరువాత, ఈ జంట ఆమె యొక్క చిత్రాన్ని మొదటిసారి పంచుకున్నారు. వారు ఆమెకు వామికా అని పేరు పెట్టారని వెల్లడించారు.
 
ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా... "మేము ప్రేమనే మా జీవన విధానంగా కలిసి జీవిస్తున్నాము. కానీ ఈ చిన్నది, వామికా దానిని సరికొత్త స్థాయికి తీసుకువెళ్ళింది! కన్నీళ్లు, నవ్వు, ఆందోళన, ఆనందం - కొన్ని నిమిషాల వ్యవధిలో అనుభవించిన భావోద్వేగాలు. మీ కోరికలు, ప్రార్థనలు, మంచి శక్తిని మాకు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు "అని అనుష్క శర్మ- విరాట్, కుమార్తె వామికాతో కలిసి ఒక చిత్రాన్ని పోస్ట్ చేశారు.