శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 జనవరి 2021 (19:13 IST)

విరాట్ కోహ్లీ కొత్త రికార్డ్.. ధోనీని వెనక్కి నెట్టనున్నాడా?

భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ కోహ్లీకి రికార్డులు సృష్టించడం కొత్తేమీ కాదు. బ్యాట్స్‌మెన్‌గా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన కోహ్లీ, తాజాగా మరో కొత్త రికార్డుకి చేరువలో ఉన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై విజయం సొంతం చేసుకున్న టెస్ట్ సిరీస్‌లో భాగం కాలేకపోయిన కోహ్లీ, తాజాగా ఇంగ్లండ్‌తో జరిగే ఆటలో బరిలో దిగనున్నాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో క్లైవ్ లాయిడ్‌ని వెనక్కి నెట్టి నాలుగవ స్థానంలో నిలిచేలా ఉన్నాడు.
 
క్లైవ్ లాయిడ్ ని అందుకోవడానికి 14పరుగుల అవసరమే ఉన్నాయి. ఆ 14 పరుగులని చేరుకోగలిగితే టెస్టుల్లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన నాలుగవ ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం నాలుగవ స్థానంలో క్లైవ్ లాయిడ్ (5233 పరుగులు) ఉండగా, మూడవ స్థానంలో రికీ పాంటింగ్ (6542 పరుగులు), రెండవ స్థానంలో అలెన్ బార్డర్ (6623 పరుగులు), మొదటి స్థానంలో గ్రేమ్ స్మిత్ (8659 పరుగులు) ఉన్నారు. ప్రస్తుతం కోహ్లీ 5220 పరుగులతో ఐదవ స్థాన్ంలో ఉన్నాడు.
 
అలాగే భారత్ గడ్డపై టీమిండియాని 21 టెస్టుల్లో కెప్టెన్‌గా మహేంద్రసింగ్ ధోనీ గెలిపించగా.. ఇప్పటికే విరాట్ కోహ్లీ 20 విజయాలతో ఉన్నాడు. దాంతో.. ఇంగ్లాండ్‌తో ఫ్రారంభం కానున్న సిరీస్‌లో రెండు టెస్టుల్లో భారత్ గెలిచినా..? ధోనీని వెనక్కి నెట్టి విరాట్ కోహ్లీ 22 విజయాలతో నెం.1 స్థానానికి ఎగబాకనున్నాడు. 
 
ధోనీ, కోహ్లీ తర్వాత మహ్మద్ అజాహరుద్దీన్ 13 విజయాలు, సౌరవ్ గంగూలీ 10 విజయాలతో టాప్-4లో కొనసాగుతున్నారు. 2016-17లో భారత్ పర్యటనకి వచ్చిన ఇంగ్లాండ్ టీమ్‌ని టెస్టు సిరీస్‌లో 4-0తో కోహ్లీ కెప్టెన్సీలోని భారత్ జట్టు చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే.