ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 జనవరి 2021 (21:13 IST)

కోహ్లీకి థ్యాంక్స్ చెప్పిన డేవిడ్ వార్నర్... చిట్టితల్లిని చూస్తే..?

Kohli
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూతురు ఇండిరే కూడా కోహ్లీకి పెద్ద ఫ్యాన్. 
 
గత ఏడాది కోహ్లీ అంటే తన కూతురుకి ఎంతో ఇష్టమని చెప్పిన వార్నర్.. తాజాగా విరాట్ నుంచి టెస్టు జెర్సీని తీసుకెళ్లి ఆమెకి బహూకరించాడు. కోహ్లీ సంతకం చేసిన ఆ జెర్సీని సంతోషపడింది. దీనికి సంబందించిన ఫొటోని సోషల్ మీడియాలో వార్నర్ అభిమానులతో పంచుకున్నాడు.
  
తాజాగా డేవిడ్‌ వార్నర్‌ ముద్దుల కూతురు ఇండిరే.. విరాట్‌ కోహ్లీ జెర్సీని ధరించి ఫోటోకు ఫోజిచ్చింది. ఈ సందర్భంగా వార్నర్.. కోహ్లీకి థ్యాంక్స్‌ చెప్పాడు. 'మేం సిరీస్‌ ఓడిపోయామని మాకు తెలుసు.. కానీ ఒక్కసారి ఇక్కడ నవ్వుతున్న చిట్టితల్లిని చూస్తే ఆ బాధనంతా మరిచిపోతాం. విరాట్‌ నీ జెర్సీ నా కూతురుకి పంపినందుకు చాలా థ్యాంక్స్‌. నీ జెర్సీ ధరించి నా చిట్టితల్లి మురిసిపోతుంది' అంటూ క్యాప్షన్‌ జతచేశాడు.  
 
ఆసీస్‌ పర్యటనలో బోర్డర్-గవాస్కర్‌ ట్రోఫీని టీమిండియా 2-1 తేడాతో వరుసగా రెండోసారి గెలచుకొని చరిత్ర సృష్టించింది. చివరి టెస్టు జరిగిన గబ్బా మైదానంలో ఆసీస్‌ విధించిన 324 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి ఆసీస్‌ 32 ఏళ్ల జైత్రయాత్రకు చెక్‌ పెట్టింది.