సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 జనవరి 2021 (11:55 IST)

శ్రీదేవి చిన్నకూతురు ఖుషీ.. హీరోయిన్‌గా వచ్చేస్తోంది..!

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం హీరోయిన్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీదేవి రెండో కుమార్తె కూడా హీరోయిన్‌గా రానుంది. శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతూ వస్తుంది. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఖుషీని లంచ్ చేయడానికి సిద్ధమయ్యారని కూడా వార్తలు వస్తున్నాయి. 
 
తాజాగా ఈ అమ్మడు సినీరంగ ప్రవేశం చేయడానికి ముహూర్తం ఖరారైందని తెలుస్తుంది. ఇక ఖుషీకపూర్ వచ్చే ఏడాది లాంచ్ అవుతుందని ఆ మేరకు బోనీ ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నాడని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 
ప్రస్తుతం ఖుషీ లండన్‌లో యాక్టింగ్ కోర్స్ చేస్తుంది. ఒక వేళ ఈ వార్త నిజమైయితే ఖుషీకపూర్ నటించే తొలిసినిమా అనౌన్స్ మెంట్ త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. అసలే బాలీవుడ్ లో నెపోటిజం పై పెద్దఎత్తున విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ స్టార్ కిడ్ ఎంట్రీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది