ఫోన్ దాచిపెట్టాడనీ... కన్న తండ్రిని కొట్టి చంపిన కుమార్తె... ఎక్కడ?
మొబైల్ ఫోన్‌కే అంకితమైన కుమార్తెను తిరిగి దారికి తెచ్చే క్రమంలో కుమార్తె చేతిలో తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. మొబైల్ ఫోన్ దాచిపెట్టాడన్న కోపంతో కన్నతండ్రిని కుమార్తె కొట్టి చంపేసింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లాలో జరిగింది.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బిలాస్‌పూర్ జిల్లాలోని కాంచన్‌పూర్ గ్రామానికి చెందిన మాంగ్లు రామ్ధనుకర్ (58) అనే వ్యక్తికి దివ్య సరస్వతి అనే కుమార్తె ఉంది. ఈమెకు వివాహమైంది. ఇటీవలే ఆమె భర్త తల్లిదండ్రుల దగ్గరకి పంపించాడు.
పుట్టింటికి వచ్చిన సరస్వతి... తన సెల్‌ఫోన్ కనిపించడం లేదని తండ్రి మాంగ్లును అడిగింది. తనేమన్న తీస్తే ఇవ్వమంది. తను సెల్‌ఫోన్ తీయలేదని మాంగ్లు సమాధానమిచ్చాడు.
అనుమానమొచ్చి కాస్త గట్టిగా అడిగింది సరస్వతి. దాంతో అతను నిజం చెప్పాడు. తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లిచేసుకున్నందుకే ఫోన్ దాచినట్లు తెలిపాడు.
ఎంతకీ ఫోన్ ఇవ్వకపోవడం వల్ల కర్రతో కొట్టి, రాయితో బాది తండ్రిని హతమార్చిందని పోలీసులు తెలిపారు. శవాన్ని ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టిందని, అందుకు ఆమె తల్లి సహకరించిందని పేర్కొన్నారు.
పక్కింటివారు ఈ ఘటనను చూసి తమకు సమాచరమిచ్చారని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరిని అరెస్టు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.