శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 నవంబరు 2021 (11:30 IST)

మ‌హేశ్ బాబు సరసన లావణ్య త్రిపాఠి..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబో ఓ సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ చిత్రంలో మ‌హేశ్ స‌ర‌స‌న పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది.

అయితే.. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కూడా మ‌రో పాత్ర ఉంద‌ని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం న‌భా న‌టేష్ ను సెలెక్ట్ చేసిన‌ట్టు ఆ మ‌ధ్య వార్త‌లు వ‌చ్చాయి. కానీ, స‌డెన్ గా తెర‌మీదకి లావ‌ణ్య త్రిపాఠి పేరు తీసుక‌వ‌చ్చారు.
 
మ‌హేశ్ బాబు స‌ర‌స‌న హీరోయిన్‏గా న‌టించే ల‌క్కీ ఛాన్స్ కొట్టేసింద‌ని టాలీవుడ్ లో టాక్ వ‌స్తుంది. ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇక చిత్రం షూటింగ్ డిసెంబర్ నుంచి షూరు కానుంది. గతంలో మహేష్ త్రివిక్రమ్ కాంబోలో అతడు, ఖలేజా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చారు.

తాజా సినిమాతో ఏవిధంగా అలరిస్తారో వేచి చూడాలి. ఇక‌ ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.