శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 15 అక్టోబరు 2018 (19:00 IST)

కారు తలుపుల్ని లాక్ చేశాడు.. ఒడిలోని మొబైల్‌ని విసిరికొట్టాడు.. ఆ తర్వాత?

కోలీవుడ్ రచయిత, షార్ట్ ఫిల్మ్స్ దర్శకురాలైన లీనా మణిమేగలై, తిరుట్టుపయలే, కందసామి వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన డైరక్టర్ సుశీ గణేషన్‌ తనను లైంగికంగా వేధించారని చెప్పుకొచ్చింది

మీ టూ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు అక్కడ నుంచి దక్షిణాదికి పాకిన ఈ ఉద్యమంలో పాల్గొనే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. కోలీవుడ్‌లో ప్రముఖ గాయకుడు వైరముత్తుపై గాయని చిన్మయి లైంగికంగా వేధించినట్లు ఆరోపించింది. ఈ ఆరోపణల అనంతరం లైంగిక వేధింపుల బాధితులు ఒక్కొక్కరు వెలుగులోకి వస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో కోలీవుడ్ రచయిత, షార్ట్ ఫిల్మ్స్ దర్శకురాలైన లీనా మణిమేగలై, తిరుట్టుపయలే, కందసామి వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన డైరక్టర్ సుశీ గణేషన్‌ తనను లైంగికంగా వేధించారని చెప్పుకొచ్చింది. ఈ మేరకు తన ట్విట్టర్ పేజీలో మీ టూ హ్యాష్ ట్యాగ్‌తో తన గోడును వినిపించారు. 
 
ఇందులో భాగంగా 2005వ సంవత్సరం తాను ఓ టీవీ ప్రోగ్రామ్‌లో ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. ఆ సమయంలో ప్రముఖ యంగ్ డైరక్టర్ అయిన సుశీ గణేశన్‌ను ఇంటర్వ్యూ చేశాను. షూటింగ్ పూర్తి చేసేందుకు రాత్రి 9.30 గంటలైంది. 
 
సాధారణంగా తాను ఆటోలో ఇంటికెళ్తాను. ఆటో కోసం కాసింత దూరం నడిచి వెళ్లేటప్పుడు తాను ఇంటర్వ్యూ చేసిన డైరక్టర్ (సుశీ గణేశన్) తనను డ్రాప్ చేస్తానన్నాడు. ఆయన మాటలు నమ్మి కారులో కూర్చున్నాక కాసేపు మాటలు బాగానే సాగాయి. ఉన్నట్టుండి ఆయన వాయిస్ మారింది. కాస్ట్లీ అయిన ఆయన కారును సెంట్రల్ లాక్ చేశాడు. తన ఒడిలో వున్న మొబైల్ తీసుకుని.. స్విచ్ఛాఫ్ చేసి విసిరేశాడు. అతని అపార్ట్‌మెంట్‌కు రావాల్సిందిగా బలవంతం చేశాడు. దీంతో షాక్ తిన్నాను. నోట మాట రాలేదు. 
 
తొలుత తనను వదిలిపెట్టాల్సిందిగా వేడుకున్నాను. కానీ ఆ తర్వాత కారు తలుపులు పగులకొట్టేస్తానని బెదిరించాను. అయినా 20 నిమిషాల్లోనే ఇంటికి చేరుకునే తనను 45 నిమిషాల పాటు కారులోనే బంధించి.. కారును సిటీ మొత్తం తిప్పించాడు. కాలేజీ చదివే రోజుల్లో తన సంచిలో ఓ కత్తిని వుంచుకోవడం తన అలవాటు. ఆ కత్తికి ఆ రోజే పని పడింది. 
 
ఆ కత్తే తనను కాపాడింది. ఇంటికి చేరుకునేలా చేసింది. తన మొబైల్ తనకు తిరిగి ఇచ్చేలా చేసింది. ప్రస్తుతం హక్కుల గురించి మాట్లాడే తనకు.. ఈ వ్యవహారాన్ని అప్పుడు బయటికి చెప్పుకునే ధైర్యం లేదు. ఇంట్లో చెప్తే ఉద్యోగం మాన్పిస్తారని భయంతో చెప్పలేదు. ఇప్పటికీ ఈ సంఘటనను తలచుకుంటే ఒళ్లు గగుర్పాటుకు గురవుతుందని మణిమేగలై వాపోయింది.