ముఖంపై ముద్దులు పెడుతూ రాక్షసానందం పొందాడు.. సింగర్ సునీత
'మీటూ' ఉద్యమ పుణ్యమాని మరో గాయని నోరు విప్పింది. తాను కూడా లైంగిక వేధింపులకు గురైనట్టు చెప్పుకొచ్చింది. ఆ సింగర్ పేరు సునీత సారథి. ఈమెకు ఎదురైన అనుభవాలను సోషల్ మీడియా సాధనమైన ఫేస్‌బుక్ ద్వారా బహిర్గతం చేసింది. బాల్యం నుంచే లైంగిక దాడులు జరుగుతున్నాయని, నా పోస్ట్ వలన కొందరు మహిళలకి ధైర్యం వస్తుందన్న భావనంతో తనకు జరిగిన విషయాలను షేర్ చేస్తున్నట్టు తెలిపింది.
ఈ వివరాలను పరిశీలిస్తే... "నాలుగైదేళ్ల వయస్సులో మా అమ్మ వాళ్ల సోదరుడు మా ఇంటికి వచ్చి నన్ను బెడ్ రూంలోకి తీసుకెళ్లి ముద్దులు పెట్టి, అసభ్యంగా తాకుతూ వేధించేవాడు. నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడని అందరు భావించేవారు. కానీ కొన్నేళ్ళ తర్వాత ఆయన వికృత చేష్టలు అర్థమై నిర్ఘాంతపోయాను. ఇక మా అమ్మ సహోద్యోగి కూడా న్ను వేధించేవాడు. నన్ను ఎత్తుకొని ఆడించినట్టు చేస్తూ వికృత చేష్టలు చేసేవాడు. అతనిని నేను ఎంతగానో అసహ్యించుకునేదాన్ని. ఓ రోజు మా ఇంటికి వచ్చిన అతని దగ్గరకి లాక్కొని లిప్ లాక్ ఇచ్చాడు. వదిలించుకునేందుకు ప్రయత్నించగా ముఖంపై ముద్దులు పెడుతూ రాక్షసానందం పొందాడు. వెంటనే బాత్ రూంకి వెళ్లి ముఖం నోరు కడుక్కొని వచ్చాను అని ఆమె పేర్కొన్నారు.
ఇకపోతే, లైంగిక బాధితుల తరపున మాట్లాడుతున్నసింగర్ చిన్మయి నాకు స్నేహితురాలు కాకపోయిన ఆమె జీవితంలో చేదు ఘటనలు ఎలా జరిగాయో, నాకు అలానే జరిగాయి. మహిళలు కలిసి ముందడుగు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. మీటూ వలన నా బాధని అందరితో పంచుకునే అవకాశం లభించింది. నిజాన్ని నిర్భయంగా చెబుతూ వెకిలి చేష్టలు చేసేవాళ్లకి కఠిన శిక్ష పడేలా ఆలోచనలు చేయాలి. మగవాళ్లు కూడా మాకు మద్దతు తెలిపితే నీచులకు శిక్ష పడేలా చేయవచ్చునంటూ’ సింగర్ సునితా సారథి పోస్ట్‌లో తెలిపింది.