శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 28 జులై 2017 (14:51 IST)

ఒక రేప్ కేసు... ఒక లవ్ ఎఫైర్... ఇప్పుడు గుండెపోటు... సల్మాన్ ఫ్రెండ్ చనిపోయాడు...

బాలీవుడ్ నటుడు ఇందర్ కుమార్ శుక్రవారం తెల్లవారు జామున 2 గంటలకు గుండెపోటుతో కన్నుమూశాడు. ఆయన వయసు 45 సంవత్సరాలు. ఇప్పుడిప్పుడే నటుడిగా నిలదొక్కుకుంటున్న సమయంలో ఆయన గుండెపోటుతో మరణించడంపై బాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి చెందింది. ఇక బాలీవుడ్ కండల వీరుడు

బాలీవుడ్ నటుడు ఇందర్ కుమార్ శుక్రవారం తెల్లవారు జామున 2 గంటలకు గుండెపోటుతో కన్నుమూశాడు. ఆయన వయసు 45 సంవత్సరాలు. ఇప్పుడిప్పుడే నటుడిగా నిలదొక్కుకుంటున్న సమయంలో ఆయన గుండెపోటుతో మరణించడంపై బాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి చెందింది. ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇతడు మంచి స్నేహితుడు. సల్మాన్ ఖాన్ ఇంట్లో ఏది జరిగినా అతడు హాజరవుతుంటాడు. 
 
ఇక అతడి సినీ అరంగేట్రం గురించి చూస్తే 1996లో మాసూమ్ అనే హిందీ చిత్రం ద్వారా పరిచయమయ్యాడు. ఆ తర్వాత సుమారు 20 చిత్రాల్లో నటించాడు. వాటిలో సల్మాన్ ఖాన్ వాంటెడ్ చిత్రం కూడా వుంది. ఇంకా బుల్లితెరపై కూడా అతడు పలు పాత్రల్లో కనిపించాడు. 
 
వ్యక్తిగత జీవితాన్ని చూస్తే... 2014లో ఓ మోడల్‌ను రేప్ చేశాడన్న అభియోగంపై అరెస్టు చేశారు. సినీ ఛాన్సులు ఇప్పిస్తానని సదరు మోడల్ ను ఇందర్ కుమార్ నమ్మించి తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ తర్వాత క్రమంగా ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. కానీ మోడల్ మాత్రం అతడిపై రేప్ కేసు పెట్టింది. తనకు సినీ అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని కేసులో పేర్కొంది. కానీ ఇందర్ కుమార్ మాత్రం అది రేప్ కాదనీ, పరస్పరం అంగీకరంతోనే శారీరకంగా కలిశామని చెప్పాడు. 
 
ఇక బాలీవుడ్ అంటేనే డేటింగ్ అనే మాట కూడా వినబడుతుంది. బాలీవుడ్ నటి ఇషా కోప్పికర్ తో ఇతడు 12 ఏళ్లపాటు డేటింగ్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ బ్రేకప్ అయ్యారు. ఆ వెంటనే కమల్జిత్ కౌర్‌ను పెళ్లాడాడు. కానీ పెళఅలి చేసుకున్న రెండు నెలలకే ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు.