శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 3 మే 2021 (19:28 IST)

చెస్ట్ కొంచెం చూపించ‌వా.. మా ఆయ‌న వ‌స్తే వేరుగా వుంట‌ది: అన‌సూయ‌

virja, nikhil, anasuya
ఏదీ! నీ టీనేజ్ చూపించు ఒక‌సారి. అంటూ విరాజ్ ప‌క్క‌నే వున్న నిఖిల్ ష‌ర్ట్‌ను లాగి చూస్తాడు. ఇక నిఖిల్‌, నేనో పెద్ద ఫిగ‌ర్‌ని. అంటూ కాస్త కొంటెగా బ‌దులిస్తాడు. నాకు ఇ లాంటిది కావాల‌న్నా.. అంటూ ఆ ప‌క్క‌నే వున్న అనసూయ అడుగుతుంది. ఆ త‌ర్వాత అత‌ని ష‌ర్ట్‌ను ప‌ట్టుకుని చెస్ట్ క‌న‌బ‌డేలా చేస్తుంది. ఆ వెంట‌నే నిఖిల్ ఏదో డైలాగ్ చెబుతాడు. అన‌సూయ ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతుంది. ప‌క్క‌న విరాజ్ కూడా న‌వ్వుతాడు.ఈ మాట‌ల‌న్నీబీప్ సౌండ్‌లో వుంటుంది. ఈ స‌ర‌దా స‌న్నివేశం అన‌సూయ ఇంటి ద‌గ్గ‌ర జ‌రిగింది.
 
యూట్యూబ్‌లో క్రియేట్ కాన్సెప్ట్ చేసే నిఖిల్ సింహా `థ్యాంక్యూ బ్ర‌ద‌ర్‌` సినిమా ప్ర‌మోష‌న్‌ను వినూత్నంగా చేసే కాన్సెప్ట్‌తో అన‌సూయ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడు. అలా ముగ్గురూ స‌ర‌దాగా మాట్లాడుకుంటూ కారులో బ‌య‌లు దేరారు. ఇది రెస్‌పెక్ట‌బుల్ వుండే ప్లేస్ అంటూ అన‌సూయ కారులో వారికి చెప్ప‌గానే. అందుకేగా మేం వుంటున్నామంటూ కారు డ్రైవింగ్‌లో వున్న విరాజ్ చెబుతాడు. వెంట‌నే నిఖిల్‌, వ‌య‌స్సున్న వారింట్లో, అని ఏదో చెప్ప‌గానే... అస‌లు వ‌య‌స్సు ఎందుకు వ‌చ్చింద‌ని నీకు అంటూ చిలిపిగా నిఖిల్‌ను కొడుతుంది. 
 
anasuya talking
ఆ త‌ర్వాత ఏంటీ, నీకు బిర్యానీ కావాలా.. అని విరాజ్ మాట‌ల్లో పెడ‌తాడు. మా ఆయ‌న వ‌స్తే క‌థ వేరుగా వుంటుంది. అంటూ బ‌దులిస్తుంది... ఇలా స‌ర‌దాగా సాగిన ఈ జ‌ర్నీలో ఎక్కువ భాగం నిఖిల్ చెస్ట్ క‌న‌ప‌డేలా అన‌సూయ చేసిన సీన్‌కు చాలామంది సోష‌ల్‌మీడియాలో స్పందించారు. మేల్ హోస్ట్‌ను ఫిమేల్ హోస్ట్ రాగింగ్ చేయ‌డం బిగ్ థింక్‌. అంటూ ఒక‌రంటే. చాక్‌లెట్ బాయ్‌ను స‌ప్ప‌రించేశారుగా. అంటూ మ‌రో అభిమాని సెటైర్‌వేశాడు. ఇలా అన‌సూయ కావాల‌నే త‌న సినిమా ప్ర‌మోషన్ కోసం ఇటువంటి కాన్సెప్ట్‌ను ఎన్నుకుంది. ఈ నెల 7న ఓటీటీలో ఆమె న‌టించిన థ్యాంక్యూ బ్ర‌ద‌ర్ సినిమా విడుద‌ల కాబోతుంది.