గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 26 ఏప్రియల్ 2021 (17:57 IST)

మే7న `ఆహా`లో విడుద‌ల‌వుతున్న `థాంక్యూ బ్ర‌ద‌ర్‌`

Thankyou Brother
హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం `ఆహా`. బ్లాక్‌బ‌స్ట‌ర్ ఫిలింస్‌, ఒరిజినల్స్, వెబ్ షోస్‌ల‌తో ఈ వేస‌విలో తెలుగు ప్రేక్ష‌కుల‌కు హౌస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది. ఈ ఏడాదిలో క్రాక్‌, గాలి సంప‌త్, నాంది, లెవ‌న్త్ అవ‌ర్‌, మెయిన్‌, తెల్ల‌వారితే గురువారం, చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రాల త‌ర్వాత ఎగ్జ‌యిటింగ్ థ్రిల్ల‌ర్ `థాంక్యూ బ్ర‌ద‌ర్‌` సినిమా `ఆహా`లో మే 7న డైరెక్ట్‌గా రిలీజ్ అవుతుంది.
 
అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, విరాజ్ అశ్విన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ‘థాంక్యూ బ్రదర్’. ఈ చిత్రాన్ని ర‌మేష్ రాప‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో మాగుంట శ‌ర‌త్ చంద్రా రెడ్డి నిర్మించారు. ఓ యువ‌కుడు, గ‌ర్భ‌వ‌తి అయిన‌ మ‌హిళ అనుకోకుండా ఓ లిఫ్ట్‌లో ఇరుక్కుంటారు. అప్పుడు వారెలాంటి ప‌రిస్థితులను ఎదుర్కొంటారు. వారి ఎమోష‌న్స్ ఎలా ఉంటాయి అనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ‘థాంక్యూ బ్రదర్’. నిజానికి ఈ చిత్రాన్ని ఈ నెల‌లో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. అయితే ప్ర‌స్తుతం కొవిడ్ సెకండ్ వేవ్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌టంతో ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకుని తెలుగు ఓటీటీ మాధ్య‌మం `ఆహా`లో మే 7న విడుద‌ల చేయ‌డానికి నిర్ణ‌యించుకున్నారు. 
 
థియేట‌ర్‌లో చూడాల్సిన సినిమా, కానీ త‌ప్ప‌దుః ద‌ర్శ‌కుడు
ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క నిర్మాత‌లు, అన‌సూయ జూమ్‌లో పాల్గొన్నారు. లిఫ్ట్ లో గ‌ర్బిణి మ‌హిళ చిక్కుకుంటే ఎలా వుంటుంద‌నే ఆలోచ‌న‌లోంచి పుట్టిన క‌థ‌. ఇది ఎక్క‌డా కాపీ కాదనీ, లిఫ్ట్ లోనే క‌థంతా ఎక్కువ శాతం జ‌రుగుతుంద‌ని ఇందుకు కెమెరామెన్‌, టెక్నీషియ‌న్ ప‌డ్డ శ్ర‌మ అంతా ఇంతా కాద‌ని మొత్తానికి థియేట‌ర్‌లో విడుద‌ల చేయ‌లేక‌పోయామ‌నే చిన్న బాధ మిన‌హా స‌రైన టైంలో ఓటీటీలో విడుద‌ల‌వుతుంద‌నే ఆనందంగా వుంద‌ని ద‌ర్శ‌కుడు పేర్కొన్నారు.
 
గొప్ప అనుభూతినిచ్చిన పాత్రః అన‌సూయ‌
గ‌ర్భిణిగా చేయాల‌ని ద‌ర్శ‌కుడు చెప్పిన‌ప్పుడు నాకు ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టిన‌ప్పుడు క‌లిగిన సంగ‌తులు గుర్తుకు వ‌చ్చాయి. మ‌హిళ‌కు మాతృత్వం అనేది గొప్ప అనుభూతి. అది సినిమా ద్వారా మ‌రోసారి గుర్తు చేశారు. ఈ పాత్ర కోసం ఎటువంటి పాత్ర‌ను అనుస‌రించాల్సిన అవ‌స‌రం క‌ల‌గ‌లేదు. అయితే క‌థ చాలా ఆస‌క్తిక‌రంగా ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించాడు. దీనికి కొన‌సాగింపు కూడా వుండేలా ముగింపు వుంటుంద‌ని తెలిపారు.
 
తెలుగు ఓటీటీ మాధ్య‌మం `ఆహా` క్వాలిటీ తెలుగు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను ప్రేక్ష‌కులకు నేరుగా అందిస్తోంది. గ్రిప్పింగ్ కథ‌నం, వైవిధ్య‌మైన క‌థాంశం ఉన్న చిత్రాల‌ను ఆహా నేరుగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువ చేస్తుంది. `థాంక్యూ బ్ర‌ద‌ర్` చిత్ర ట్రైల‌ర్‌ను స్టార్ హీరో విక్టరీ వెంక‌టేశ్ విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచే కాదు.. రెబల్‌స్టార్ ప్ర‌భాస్‌, సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌, వెర్స‌టైల్ యాక్ట‌ర్ రానా ద‌గ్గుబాటి స‌హా నెటిజ‌న్స్  నుంచి చాలా మంచి ర‌స్పాన్స్ వ‌చ్చింది. ఆస‌క్తి క‌రంగా ఉండే డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌, ఎగ్జ‌యిటింగ్ క్లైమాక్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ స‌రైన పాళ్ల‌లో  ‘థాంక్యూ బ్రదర్’ చిత్రం రూపొందింది.
న‌టీన‌టులు: అన‌సూయ భ‌రద్వాజ్‌, విరాజ్ అశ్విన్‌, అర్చ‌నా అనంత్‌, అనీష్ కురువిల్లా, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌, మోనికా రెడ్డి, హ‌ర్ష చెముడు త‌దిత‌రులు
 
స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  రమేష్ రాప‌ర్తి
నిర్మాత‌లు:  మాగుంట శ‌ర‌త్ చంద్రా రెడ్డి, తార‌క్‌నాథ్ బొమ్మిరెడ్డి
సినిమాటోగ్ర‌ఫీ:  సురేష్ ర‌గుతు
సంగీతం:  గుణ బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్‌
ఆర్ట్‌:  పురుషోత్తం ప్రేమ్‌