సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 ఏప్రియల్ 2021 (19:48 IST)

గ్లామర్ కోసం వైన్ తాగుతాను.. రాత్రి 2 గంటల వరకూ..? అనసూయ

అనసూయ భరద్వాజ్.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెర పై ఈమె చేసే సందడి మామూలుగా ఉండదు. తన గ్లామర్‌తో కుర్రకారుని సైతం తన వైపుకి తిప్పుకునే ట్యాలెంట్ కలిగిన యాంకర్. ఇద్దరు పిల్లలకు తల్లైనప్పటికీ కూడా హీరోయిన్లను సైతం డామినేట్ చేసే ఫిగర్ ఈమె సొంతం. 
 
బుల్లితెరపై ఎంత గ్లామర్ వలకబోసినా సినిమాల్లో చేసేప్పుడు మాత్రం కథా ప్రాధాన్యత కలిగిన పాత్రలనే పోషిస్తూ ఉంటుంది. 'క్షణం' 'రంగస్థలం' 'యాత్ర' వంటి సినిమాల్లో మంచి నటన కనపరిచి ఈమె అభిమానులతో పాటు ప్రేక్షకులందరినీ అలరించింది.
 
ఇక సోషల్ మీడియాలో కూడా ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆమె లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ తో పాటు సామాజిక అంశాల పై కూడా స్పందిస్తూ ఉంటుంది. అంతేకాకుండా… తన అభిమానులతో కూడా అప్పుడప్పుడు ముచ్చటిస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. 
 
ఇటీవల కూడా అలాగే ఆమె అభిమానులతో ముచ్చటించింది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్…' మీరు తాగుతారా అని ప్రశ్నించాడు '. ఈ ప్రశ్నకు అనసూయ ఏమాత్రం తడుముకోకుండా ' అవును ' అంటూ సమాధానం ఇచ్చింది. అంతేకాదు ' రాత్రి 2 గంటల వరకూ కూడా తాగుతాను. దాని వల్ల బుక్కైయ్యేది మా ఆయనే ' అంటూ సమాధానం ఇచ్చింది. గతంలో గ్లామర్ కోసం వైన్ తాగుతాను అంటూ తెలిపిన అనసూయ ఈసారి మాత్రం ఓపెన్ అయిపోయింది.