పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన అనసూయ

Anasuya
ఫోటో కర్టెసీ- ఫేస్ బుక్
సెల్వి| Last Updated: శనివారం, 10 ఏప్రియల్ 2021 (12:33 IST)
యాంకర్, యాక్టర్ అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తన ప్రాజెక్టుల విషయాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తూ అడపాదడపా హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. రీసెంట్‌గా నెటిజన్స్‌తో ముచ్చటించిన అనసూయ .. పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది.

ప్రస్తుతం మమ్ముట్టి చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్న అనసూయ.. త్వరలో పవన్ కళ్యాణ్‌, నేను కలిసి చేసే రచ్చ చూసేందుకు సిద్ధంగా ఉండండి. ఆ సందడి మీకు చూపించాలని చాలా ఆతృతగా ఉంది అని పేర్కొంది.

అనసూయ కామెంట్స్‌తో మెగా అభిమానులు అందరు పవన్ కళ్యాణ్‌- క్రిష్ మూవీలో ఈ హాట్ యాంకర్ ముఖ్య పాత్ర పోషిస్తుందేమో అని ఆలోచనలు చేస్తున్నారు. ఇది కాకపోతే రానా-పవన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో నటిస్తుందని అంటున్నారు.దీనిపై మరింత చదవండి :