శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (13:50 IST)

'వకీల్ సాబ్‌'గా పవన్ నో చెప్పివుంటే.. నెక్స్ట్ ఆప్షన్ ఎవరంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం "వకీల్ సాబ్". శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం తొలి ఆట నుంచే మంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. శ్రీరామ్ వేణు తెర‌కెక్కించిన ఈ చిత్రానికి సంబంధించి పెద్ద‌గా ప్ర‌మోషన్స్ చేయ‌క‌పోయిన సినిమాపై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ప‌వ‌న్ రీ ఎంట్రీ సినిమా కావ‌డంతో ఈ సినిమాను చూసేందుకు చాలా మంది ఆస‌క్తి చూపుతున్నారు. శుక్రవారం ఉద‌యం దిల్ రాజు బెనిఫిట్ షోని చూసి ఫుల్ ఎంజాయ్ చేశారు.
 
"వ‌కీల్ సాబ్" చిత్రాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాదు అంటే నాగార్జున‌తో చేయాల‌ని అనుకున్నారు. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు శ్రీరామ్ వేణు తాజాగా వెల్ల‌డించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ నెక్ట్స్ ఆప్ష‌న్‌గా నాగార్జునతో తీయాలని అనుకున్నామ‌ని చెప్పారు. 
 
కాగా, 'వ‌కీల్ సాబ్' చిత్రాన్ని దిల్ రాజు - బోనీ క‌పూర్ సంయుక్తంగా నిర్మించారు. అన‌న్య నాగ‌ళ్ల‌, అంజ‌లి, నివేదా థామ‌స్ ముఖ్య పాత్ర‌లు పోషించ‌గా, శృతి హాస‌న్ క‌థానాయిక‌గా ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. థమన్ సంగీత బాణీలు సమకూర్చారు.