గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (09:02 IST)

Vakeel Saab short Review: మరోసారి బాక్సాఫీస్ బద్దలే, థియేటర్లో దిల్ రాజు పండగ

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ప్రపంచ వ్యాప్తంగా 700 థియేటర్లలో విడుదలైంది. దాదాపు 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రమిది. ఎప్పటిలాగే పవన్ తన స్టామినా ఏమిటో నిరూపించారు. వకీల్ సాబ్ అంతటా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.
 
ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత వకీల్ సాబ్ చిత్రం పీక్స్‌కి వెళ్లిపోయిందనీ, పవన్ కళ్యాణ్ న్యాయవాదిగా అద్భుతంగా నటించారని సినిమా చూసినవారు చెపుతున్నారు. నిర్మాత దిల్ రాజు అన్నట్లు మరోసారి పవర్ స్టార్ మేజిక్ వకీల్ సాబ్ చిత్రంలో కనబడిందనీ, చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమంటున్నారు.
 
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటన అలా వుంచితే నివేదా థామస్ అద్భుతంగా నటించిందని ప్రేక్షకులు చెపుతున్నారు. మొత్తమ్మీద మరోసారి పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ కి మంచి గిఫ్ట్ ఇచ్చేశాడు.