"మహాసముద్రం"లో అనసూయ స్పెషల్ ఐటమ్ సాంగ్!
బుల్లితెర యాంకర్ అనసూయ అడపాదడపా వెండితెరపై తళుక్కున మెరుస్తోంది. అలాగే, ఐటమ్ సాంగ్‌లలో నర్తిస్తోంది. ఒకవైపు యాంకర్‌గా రాణిస్తూనే మరోవైపు స్పెషల్ సాంగుల్లో చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.
ఈ క్రమంలో తాజాగా "చావు కబురు చల్లగా" అనే సినిమా కోసం ఓ స్పెషల్ సాంగ్‌లో నర్తించిన అనసూయ అభిమానుల మనసులని గెలుచుకుంది. సినిమా కన్నా అనసూయ డ్యాన్స్‌కు మంచి మార్కులు పడటం గమనార్హం.
ఇకపోతే, ఇపుడు మరో చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసేందుకు సిద్ధమవుతోంది. "ఆర్ఎక్స్ 100" చిత్ర దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న "మహాసముద్రం"లోనూ అనసూయ ఓ స్పెషల్ సాంగ్ చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి ఈ పాటకు తొలుత ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ పేరును ప్రతిపాదించారు. కానీ, ఇపుడు పాయల్ స్థానంలో అనసూయ వచ్చి చేరింది. శర్వానంద్ , సిద్ధార్ద్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న "మహాసముద్రం" చిత్రం పక్కా ఎమోషనల్ ఎంటర్ టైనర్‌గా ఉంటుందట.
సుంకర రామబ్రహ్మం ఎకె ఎంటర్‌టైన్మెంట్ బ్యానరుపై నిర్మిస్తున్నారు. వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ మహాసముద్రం చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని వేసవి చిత్రాల తర్వాత విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.