మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 30 డిశెంబరు 2020 (19:03 IST)

అలా చేస్తానంటున్న కూడా పట్టించుకోవట్లేదు.. 'లోఫర్' బ్యూటీ (video)

మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ నటించిన చిత్రం 'లోఫర్'. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ దిశా పటానీ. ఈ చిత్రం ఫ్లాప్ కావడంతో ఈ అమ్మడుని ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో టాలీవుడ్‌కు టాటా చెప్పేసి బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. అక్కడ కూడా అనుకున్నంత గుర్తింపురాలేదు. 
 
కానీ బికినీ సుందరిగా మాత్రం గొప్ప గుర్తింపునే సొంతం చేసుకుంది. బాలీవుడ్‌లో వరుసగా కాకపోయినా ఖాళీ లేకుండా సినిమాలు చేస్తున్న దిశా పటాని దక్షిణాది మీద శీతకన్నేసినట్టున్నారు? అని ప్రశ్నిస్తే.. అదేం లేదు మంచి కథతో వస్తే చేయడానికి నేను రెడీ అంటూ తెలిపింది. పైగా, ఎలాంటి ఎక్స్‌పోజింగ్‌ చేసేందుకైనా తాను సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, 'అలాంటిదేమీ లేదు. తెలుగులో నేను చేసిన నా మొదటి సినిమా 'లోఫర్' అనుకున్నంత విజయం సాధించలేదు. ఓ విధంగా చెప్పాలంటే అది ఫ్లాప్‌ సినిమా కిందే లెక్క. దాంతో టాలీవుడ్‌ నన్ను పట్టించుకోలేదు. ఆ సమయంలోనే బాలీవుడ్‌లో అవకాశాలు వచ్చాయి. దాంతో ఇక్కడే స్థిరపడ్డాను. మంచి కథతో ఎవరైనా వస్తే దక్షిణాదిన ఏ భాషలోనైనా చేయడానికి నేను సిద్ధం' అని చెప్పుకొచ్చింది.