గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (15:48 IST)

త్వరలో అతిలోక సుందరిగా రానున్న మాధురీ దీక్షిత్..

బాలీవుడ్ వెండితెరపై బయోపిక్స్ నడుస్తున్నాయి. ఆల్రెడీ కొన్ని బయోపిక్స్ వెండితెరపైకి వచ్చాయి. మరికొన్ని సెట్స్‌లో ఉన్నాయి. ప్రస్తుతం వస్తున్న బయోపిక్స్ అన్నీ సూపర్ హిట్ సాధిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. బయోపిక్ జాబితాలో అతిలోక సుందరి శ్రీదేవి బయోపిక్ కూడా ఉంది. ఆదివారం నాడు శ్రీదేవి వర్థంతి సందర్భంగా ఆమె బయోపిక్‌ గురించి చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.
 
శ్రీదేవి భర్త అయిన బోనీ కపూర్ ఆమె బయోపిక్ నిర్మించేందుకు చాలా ఆతృతగా ఉన్నారు. శ్రీదేవి నటనకు మరెవ్వరు సాటి చెప్పలేరు. అలాంటి శ్రీదేవి బయోపిక్‌‌లో ఎవరు నటించగలరనేదే ఇక్కడి ప్రశ్న. అయితే శ్రీదేవి పాత్రలో మాధురీ దీక్షిత్ సరిపోతారని బోనీ భావిస్తున్నారని బాలీవుడ్ ఇండస్ట్రీ తాజా సమాచారం.