శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 డిశెంబరు 2020 (09:22 IST)

సితార కొత్త అవతారం.. ఏంటో తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆమెకున్న ఫాలోవర్స్ సంఖ్య అంతా ఇంతా కాదు. తాజాగా సితార బ్రాండ్ అంబాసిడర్ అవతారమెత్తింది. 3డీ యానిమేషన్‌ వెబ్‌సిరీస్‌గా తెరకెక్కించిన సిరీస్‌కు ఈ చిన్నారి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారింది. 
 
ఈ వెబ్‌సిరీస్‌ పోస్టర్‌ను బుధవారం రాత్రి మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో నమ్రతా శిరోద్కర్‌, బాలీవుడ్‌ నటి నేహా ధూపియా, తెలంగాణా ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ తదితరుల సమక్షంలో విడుదల చేశారు. ఈ సిరీస్ మొదటి సీజన్ ఏప్రిల్‌లో విడుదల చేయనున్నారట. కార్యక్రమంలో సితార తన ముద్దు ముద్దు మాటలతో ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది.