సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2023 (15:45 IST)

గుంటూరు కారం రికార్డ్.. మహేష్ సినిమా రూ.120 కోట్ల బిజినెస్

gunturu karam
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం గుంటూరు కారం కోసం పనిచేస్తున్నారు. మరి భారీ హైప్ ఉన్న ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతుండగా, ఈ సినిమా నిర్మాతలు కేవలం తెలుగు విడుదలకే మొగ్గు చూపుతున్నారు. 
 
ఇక ఈ ప్రాంతీయ చిత్రంతో తెలుగు రాష్ట్రాల్లో మహేష్ సంచలన రికార్డు నెలకొల్పినట్లు తెలుస్తోంది. ఒక్క గుంటూరు కారం తెలుగు వెర్షన్ 120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిందని వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రాంతీయంగా ఇదే అతిపెద్ద రికార్డు అని తెలిసింది. 
 
మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో మహేష్, త్రివిక్రమ్ కాంబో పవర్ ఏంటో మరోసారి రుజువైంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గుంటూరు మిర్చి నేపథ్యంలో నడుస్తోంది. 
 
మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు కొత్త కథతో ఈ సినిమా కథను ప్లాన్ చేసాడు త్రివిక్రమ్. గుంటూరు కారం చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించగా, ఎస్. థమన్ సంగీతం అందించారు.