మంగళవారం, 26 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 జనవరి 2021 (09:30 IST)

నమ్రత బర్త్‌డే.. లేడీ బాస్‌కు శుభాకాంక్షలు.. దుబాయ్‌లో ఫ్యామిలీ

Mahesh babu
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ పర్సన్ అనే సంగతి తెలిసిందే. ఎక్కువగా కుటుంబంతోనే సమయం గడిపేందుకు ఆసక్తి చూపుతుంటారు మహేష్‌. ఈ నేపథ్యంలో జనవరి 22వ తేదీ తన శ్రీమతి నమ్రత బర్త్‌డే 49వ బర్త్‌డే కావడంతో ఆమె పుట్టినరోజుని వెరైటీగా జరపాలని ప్లాన్ చేసిన మహేష్ గురువారం రోజు దుబాయ్ వెళ్ళారు. అక్కడ నమ్రత బర్త్‌డే వేడుకలను ఘనంగా జరపనున్నారు.
 
జనవరి 22వ తేదీ 1972 సంవత్సరంలో జన్మించిన నమ్రత.. నేడు 49వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆమె బర్త్‌డే సందర్భంగా పలువురు ప్రముఖులు బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మహేష్ అయితే తన శ్రీమతికి స్పెషల్ విషెస్ అందించారు. 
Mahesh babu
 
"ఈ రోజు నేను ఎంతో ప్రేమించే వ్యక్తి పుట్టిన రోజు. ప్రతి రోజు నీతో గడపడం నాకు ప్రత్యేకం. కాని ఈ రోజు మరింత ప్రత్యేకం. అద్భుతమైన స్త్రీతో అందమైన రోజు.. ప్రేమతో పుట్టిన రోజు శుభాకాంక్షలు లేడీ బాస్" అంటూ మహేష్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుది. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇంకా దుబాయ్ పర్యటనలో వున్న మహేష్ బాబు ఫ్యామిలీ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Mahesh_Sitara