గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 అక్టోబరు 2018 (14:46 IST)

2.O మేకింగ్ వీడియో పార్ట్-4 అదిరిపోయింది (Video)

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ - తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కాంబినేషన్‌లో రానున్న చిత్రం "2.O". (2 పాయింట్ ఓ) ఈ చిత్రం గతంలో వచ్చిన "రోబో"కు సీక్వెల్.

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ - తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కాంబినేషన్‌లో రానున్న చిత్రం "2.O". (2 పాయింట్ ఓ) ఈ చిత్రం గతంలో వచ్చిన "రోబో"కు సీక్వెల్. ఇందులో అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకోగా, వచ్చే నవంబరు నెలాఖరులో ప్రేక్షకుల ముందుకురానుంది.
 
ఇప్పటికే విడుదలైన టీజర్, మేకింగ్ వీడియోల ద్వారా ఆ హంగులను ప్రేక్షకులకు పరిచయం చేసిన శంకర్.. తాజాగా మరో మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. '2.O' మేకింగ్ వీడియో నాలుగో భాగం పేరుతో దీన్ని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో కనిపిస్తున్న విజువల్ ఎఫెక్ట్స్, మేకింగ్ స్టైల్ చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. 
 
మేకింగ్ వీడియోనే ఇలావుందంటే ఇక సినిమా ఎలా ఉండబోతుందా? అనే కుతూహలం ఎక్కువైపోయింది. ఇక 'రోబో'లో కథానాయికగా నటించిన ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతుండటం ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తోంది.