గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (11:03 IST)

"2.O"లో అతిథి పాత్రలో ఐశ్వర్యా రాయ్ సర్‌ప్రైజ్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ - శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'రోబో'. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఐశ్వర్యారాయ్ నటించింది. ఇపుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రం "2.O". ఈ చిత్రంలో అమీ జాక్సన్‌ హీర

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ - శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'రోబో'. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఐశ్వర్యారాయ్ నటించింది. ఇపుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రం "2.O". ఈ చిత్రంలో అమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.
 
ఈ చిత్రంలో హీరోగా రజినీకాంత్ నటిస్తుంటే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం నవంబరు 29వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే, ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ అతిథి పాత్రలో కనిపించి ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇవ్వనుంది. ఐష్‌ ఎంట్రీ సన్నివేశాల కీలకంగా ఉంటాయని, ఖచ్చితంగా అవి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని చిత్ర యూనిట్‌ భావిస్తోందట.