బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 29 సెప్టెంబరు 2018 (13:16 IST)

లక్ష్మీ హెబ్బాళ్కర్ సెన్సేషనల్ కామెంట్స్.. నాకు రూ.30కోట్లు ఆఫర్ చేశారు..

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఆపరేషన్ కమలం చేపట్టడం అనైతికమని, వారిచ్చిన ఆఫర్‌ను తిరస్కరించానని చెప్పారు. పార్టీ మారితే

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఆపరేషన్ కమలం చేపట్టడం అనైతికమని, వారిచ్చిన ఆఫర్‌ను తిరస్కరించానని చెప్పారు. పార్టీ మారితే తనకు రూ.30కోట్లు, కేబినేట్‌లో మంత్రి పదవి ఇస్తామని లక్ష్మీ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. బెళగావి గ్రామీణ నియోజకవర్గం నుంచి ప్రతినిధ్యం వహిస్తున్న ఆమె పలు విషయాలను మీడియా ముందు బయటపెట్టారు. 
 
బీజేపీ నాయకులు తనతో ఫోనులో జరిపిన సంభాషణు రికార్డు చేసి.. ఆపరేషన్ కమలం గురించి హోం మంత్రి పరమేశ్వర్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపింది. కర్ణాటక రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వ భద్రతకు ఎలాంటి ఢోకాలేదన్నారు. ఐదేళ్లపాటు ఈ ప్రభుత్వమే అధికారంలో కొనసాగుతుందన్నారు. 
 
మరోవైపు జర్కిహోళి సోదరులతో తాజా వివాదాలతో పార్టీలో ఆదరణ కరువైన నేపథ్యంలో మహిళా ఎమ్మెల్యే బీజేపీపై విమర్శలు చేసి లబ్ది పొందాలని చూస్తున్నారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. త్వరలో చేపట్టనున్న రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో చోటు కోసమే హెబ్బాల్కర్ ఈ ఆరోపణలు చేశారంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు.