సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Modified: శనివారం, 29 సెప్టెంబరు 2018 (21:30 IST)

మీ వార రాశి ఫలితాలు... 30-09-2018 నుంచి 06-10-2018 తేదీ వరకు...(Video)

కర్కాటకంలో రాహువు, కన్యలో రవి, బుధులు, తులలో గురు, శుక్రులు, ధనస్సులో శని, మకరంలో కుజ, కేతువులు, వృషభ, మిధున, కర్కాటక, సింహంలలో చంద్రుడు. 5న శుక్రుడు వక్రమారంభం.

కర్కాటకంలో రాహువు, కన్యలో రవి, బుధులు, తులలో గురు, శుక్రులు, ధనస్సులో శని, మకరంలో కుజ, కేతువులు, వృషభ, మిధున, కర్కాటక, సింహంలలో చంద్రుడు. 5న శుక్రుడు వక్రమారంభం. 6న బుధుడు తుల ప్రవేశం, నిత్సావసర వస్తువుల ధరలు అధికమవుతాయి. 
 
మేషం: అశ్వని, భరణి, వృత్తిక 1వ పాదం
వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఆహ్వానం, కీలక పత్రాలు అందుతాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతోషకరమైన వార్తలు వింటారు కష్టం ఫలిస్తుంది. మెుండిబాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం. స్థిరాస్తి కొనుగోలు పట్ల ఆసక్తి కనబరుస్తారు. పరిచయస్తుల రాకపోకలు అధికమవుతాయి. పనుల ప్రారంభంలో చికాకులెదురవుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ఆత్మీయులకు సాయం అందిస్తారు. గృహమార్పు ఫలితం కనిపిస్తుంది. వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు ధనప్రాప్తి. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఈ వారం సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలకు ఆమోదం లభిస్తుంది. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి. పనులు హడావుడిగా సాగుతాయి. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. లక్ష్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఉన్నతికి తోడ్పడుతాయి. వేడుకలకు హాజరవుతారు. బంధుత్వాలు బలపడుతాయి. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. పరిచయం లేని వారితో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం వినియోగించుకోండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. వృత్తుల వారికి ఆశాజనకం. ప్రయాణానికి సన్నాహాలు సాగిస్తారు.  
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కొన్ని ఇబ్బందుల నుండి బయటపడుతారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆది, సోమ వారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుకాదు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు. ఆశ్చర్యమైన సంఘటనలెదురవుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. వేడుకల్లో పాల్గొంటారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి, ధనలాభం. అధికారులకు ఒత్తిడి, పనిభారం. ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. క్రయవిక్రయాలు ఊపందుకుంటాయి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం. పుష్యమి, ఆశ్లేష
శుభకార్యం నిశ్చయమవుతుంది. ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది ఉండదు. పట్టుదలతో శ్రమిస్తారు. లక్ష్యం నెరవేరుతుంది. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. అనేక పనులతో సతమతమవుతారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. మంగళ, బుధ వారాల్లో అకారణంగా మాటపడవలసి వస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. కుటుంబీకుల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. సంతానం దూకుడు అదుపు చేయండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడుతారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. అధికారులకు కొత్త బాధ్యతలు, పనిభారం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కాంట్రాక్టులు, ఏజెన్సీలు దక్కించుకుంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పదోన్నతి పొందుతారు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. శ్రమ ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసవస్తువలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. కొంతమంది ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమెుత్తం సాయం తగదు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పదవులు, బాధ్యతలు నుండి తప్పుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆప్తుల సలహా తీసుకోండి. గురు, శుక్ర వారాల్లో అనాలోచితంగా వ్యవహరించవద్దు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వివాదాలు కొలిక్కి వస్తాయి.  
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. బాధ్యతలు అప్పగించి అవస్థ పడుతారు. ఊహించని సంఘటనలెదురవుతాయి. అప్రమత్తంగా ఉండాలి. శనివారం నాడు ఆభరణాలు, పత్రాలు జాగ్రత్త. కొంతమెుత్తం ధనం అందుతుంది. ఇబ్బందులు తొలగుతాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. మానసికంగా స్థిమితపడుతారు. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. గృహమార్పు కోరుకుంటారు. కొత్త పరిచయాలేర్పడుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. పెట్టుబడులపై దృష్టి పెడతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత అనుభవాలు అనుభూతినిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. వేడుకల్లో పాల్గొంటారు. 
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారాల్లో ప్రతికూలతలు, చికాకులు అధికం. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. యత్నాలు విరమించుకోవద్దు. మనస్థిమితం ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలబడదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఆది, సోమ వారాల్లో మంచికి పోతే చెడు ఎదురవుతుంది. ఆప్తుల రాకతో కుదుటపడుతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పనులు సావకాశంగా పూర్తిచేస్తారు. ఆహ్వానం, పత్రాలు అందుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు ఆమోదం లభిస్తుంది. వ్యాపారాల్లో ఆటంకాలెదురవుతాయి. మీ పథకాలు ఏమంత ఫలితమీయవు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. క్రీడాకారులకు ఆశాభంగం. 
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. ఆరోగ్యం జాగ్రత్త. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. బంధువుల వ్యాఖ్యాలు ఆలోచింపచేస్తాయి. అనేక పనులతో సతమతమవుతారు. మంగళ, బుధ వారాల్లో ప్రముఖుల ఇంటర్వ్యూ సాధ్యం కాదు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. సంతానం విజయం ఉత్సాహపరుస్తుంది. అవివాహితులు శుభవార్తలు వింటారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. కనిపించకుండా పోయిన పత్రాలు తిరిగి పొందుతారు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ప్రస్తుత వ్యాపారాలో శ్రేయస్కరం. వృత్తుల వారికి ఆశాజనకం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.  
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. మీ అభిప్రాయాలను మధ్యవర్తుల ద్వారా తెలియజేయండి. చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ధనలాభం ఉంది. రుణ విముక్తులవుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. సేవ సంస్థలకు సాయం అందిస్తారు. కొత్త పరిచయాలేర్పడుతాయి. ఆగిపోయిన పనులు పూర్తిచేస్తారు. బాధ్యతలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. తొందరపడి హామీలివ్వవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. సంతానం ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆది, సోమ వారాల్లో కావలసిన వ్యక్తుల కలయిక సాధ్య కాదు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి.  
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. ఒత్తిడి, ఆందోళన అధికం. స్థిమితంగా ఉండడానికి యత్నించండి. మంగళ, శని వారాల్లో అతిగా విశ్వసించవద్దు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. ఈ చికాకులు, ఇబ్బందులు తాత్కాలికమే. త్వరలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. పనులు సకాలంలో పూర్తికాగలవు. పరిచయాలు బలపడుతాయి. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రకటనలు, ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. గృహమార్పు నిదానంగా ఫలితమిస్తుంది. జూదాలు, బెట్టింగ్‌ల జోలికి పోవద్దు. 
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. రుణ యత్నం ఫలిస్తుంది. గురు, శుక్ర వారాల్లో అనేక పనులతో సతమతమవుతారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. విలువైన వస్తువులు, ఆభరణాలు జాగ్రత్త. విదేశీ విద్యాయత్నం ఫలించదు. విద్యార్థులకు పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. సంస్థల స్థాపనకు అనుకూలం. ఉద్యోగస్తులకు పదవీయోగం. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.   
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరబాద్ర, రేవతి
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. పొదుపు మూలక ధనం ముందుగానే గ్రహిస్తారు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిస్థితుల అనుకూలత ఉంది. సంప్రదింపులు కొలక్కి వస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పనులు మెుండిగా పూర్తిచేస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. శనివారం నాడు ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యే సేవలు అవసరమవుతాయి. ఆత్మీయుల రాకతో కుదుటపడుతారు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు అధికారులతో కొత్త సమస్యలు ఎదురవుతాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. వాహనం ఇతరుల కివ్వటం క్షేమం కాదు. వీడియోలో మీ రాశి ఫలితాలను చూడండి.