మిధునంలో రవి, బుధుడు, కర్కాటకంలో శుక్ర రాహువులు, తులలో వక్రి బృహస్పతి, ధనస్సులో వక్రి శని, మకరంలో కుజ, కేతువులు. తుల, వృశ్చిక, ధనస్సు, మకరంలో చంద్రుడు. 25న బుధుడు కర్కాటక ప్రవేశం. 26 నుంచి కుజుని వక్రమారంభం. 28న ఏరువాక పూర్ణిమ. ముఖ్యమైన పనులకు విదియ శనివారం అనుకూలదాయకం.
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆదాయం సంతృప్తికరం. ధనలాభం ఉంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. అవకాశాలను వదులుకోవద్దు. మంగళ, బుధ వారాల్లో పనుల్లో ఒత్తిడి అధికం. అనవసర జోక్యం తగదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిర్మాణాలు, మరమ్మత్తులు చేపడతారు. సంతానం ఉన్నత చదువుల కోసం శ్రమిస్తారు. ప్రకటనలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. తొందరపడి చెల్లింపులు జరుపవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. నూతన వ్యాపారులకు అనుకూలం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు ధనప్రలోభం తగదు. వృత్తుల వారికి సామాన్యం.
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వ్యూహాత్మకంగా వ్యవరహరిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆది, గురు వారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. పొదుపు మూలక ధనం ముందుగానే తీసుకుంటారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. ఆప్తులను కలుసుకుంటారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. గృహమార్పు అనివార్యం. ఉద్యోగస్తులకు పదవీయోగం, బాధ్యతల మార్పు, ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది.
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. సోదరీసోదరులతో విభేదాలు తలెత్తుతాయి. ఊహించని ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. పనులు మెుండిగా పూర్తి చేస్తారు. సంతానం ఉన్నత చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. మంగళ, శని వారాల్లో పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా ఆలోచించవద్దు. విశ్రాంతి అవసరం. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పెట్టుబడులకు తరుణం కాదు. గృహమార్పు నిదానంగా కలిసివస్తుంది. దంపతుల మధ్య సఖ్యతలోపం. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. మీ మాటే నెగ్గాలన్న పంతం తగదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు సంతృప్తికరం. ఆత్మీయులకు సాయం అందిస్తారు. మీ జోక్యం అనివార్యం. పనులు వేగవంతమవుతాయి. గురు, శుక్ర వారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. వ్యవహార ఒప్పందాల్లో మెళకువ వహించండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. పెట్టుబడులకు అనుకూలం. టెండర్లు, ఏజెన్సీలు చేజిక్కించుకుంటారు. ఉపాధ్యాయులకు పదోన్నతి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులు, సహోద్యోగులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం.
కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. విమర్శలను దీటుగా స్పందిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. నగదు. పత్రాలు జాగ్రత్త. పనులు మెుండిగా పూర్తి చేస్తారు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. శనివారం నాడు ఆశ్చర్యకరమైన సంఘటనలెదురవుతాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. నూతన వ్యాపారాలకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. సరుకు నిల్వలో జాగ్రత్త. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు సాదల వీడ్కోలు పలుకుతారు. విందులు, వినోదాల్లో మితంగా ఉండాలి. వాహన చోదకులకు దూకుడు తగదు.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ధనలాభం ఉంది. ఖర్చులు అధికం. సంతృప్తికరం. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు సానూకూలమవుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. విద్యార్థులకు విదేశీ విద్యావకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ వారం ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ధనలాభం ఉంది. సమస్యలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఒక వ్యవహారంలో జోక్యం అనివార్యం. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. సంప్రదింపులకు అనుకూలం. వ్యవహార దక్షతతో రాణిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. విమర్శలు పట్టించుకోవద్దు. మీ శ్రీ మతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. ప్రకటనలు, మధ్యవర్తులను విశ్వసించవద్దు. పెద్దల ఆరోగ్యం సంతృప్తికరం. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వృత్తుల వారికి పురోభివృద్ధి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు.
వృశ్చికం: విశాఖ 4వ పాదం అనూరాధ, జ్యేష్ఠ
అవిశ్రాంతిగా శ్రమిస్తారు. యత్నాలు విరమించుకోవద్దు. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ప్రతి వ్యవాహారం ధనంతో ముడిపడి ఉంటుంది. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి పొందుతారు. ఆది, సోమ వారాల్లో అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలేయండి. పదవులు, బాధ్యతల నుంచి తప్పుకుంటారు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. మీ శ్రీమతితో సౌమ్యంగా మెలగండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. ప్రముఖుల సందర్శనం సాధ్యం కాదు. వ్యాపారులకు ఊహించని సమస్యలెదురవుతాయి. వృత్తుల వారికి సామాన్యం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ఆశావహ దృక్పథంతో ఉద్యోయత్నం సాగించండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఖర్చులు అధికం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా ఆలోచింపవద్దు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మంగళ, బుధ వారాల్లో మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి. అభియోగాలకు దీటుగా స్పందిస్తారు. రాజీ మార్గంలో సమస్యలు పరిష్కరించుకోవాలి. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలకు సమయం కాదు. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, పనిభారం. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆందోళన తొలగి కుదుటపడుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఆత్మీయులకు సాయం అందిస్తారు. పనులు సకాలంలో పూర్తి కాగలవు. బాధ్యతలు అప్పగించవద్దు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. గురు, శుక్ర వారాల్లో ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు బలపడుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. గృహమార్పు కలిసివస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారుయ సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు పదవీయోగం, ధనలాభం. పూర్వ విద్యార్థులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రయాణం కలిసివస్తుంది.
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3, పాదాలు
సంప్రదింపులతో హడావుడిగా ఉంటారు. అప్రమత్తంగా వ్యవహరించాలి. ఏకపక్ష ధోరణి తగదు. పెద్దల సలహా పాటించండి. పరిచయాలు విస్తరిస్తాయి. ఓర్పు, శ్రమతో పనులు పూర్తిచేస్తారు. ఖర్చులు అధికం. అవసరాలు నెరవేరుతాయి. వివాహయత్నాలు ముమ్మరంగా సాగిస్తారు. శనివారం నాడు అవకాశాలు చేజారిపోతాయి. మీ సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. యత్నాలు విరమించుకోవద్దు. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానం పై దృష్టి సారిస్తారు. పెట్టుబడులకు అనుకూలం కాదు. గృహవాస్తు దోష నివారణ అనివార్యం. ఉపాధి పథకాలు ఏమంత సంతృప్తినీయవు. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త.
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆదాయానికి తగ్గట్టు బడ్జెట్ రూపొందించుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమెుత్తం ధనసహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఎవరినీ కించపరచవద్దు. బంధుమిత్రులతో విభేదిస్తారు. ఆది, సోమ వారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. నోటీసులు, పత్రాలు అందుతాయి. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. సంతానికి విదేశీ విద్యావకాశం లభిస్తుంది. నిర్మాణాలు, మరమ్మత్తులు మందకొడిగా సాగుతాయి. కాంట్రాక్టులు దక్కకపోవచ్చు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి నగదు లాభం. సాహిత్య సభల్లో పాల్గొంటారు. వీడియో చూడండి.