గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 25 జులై 2019 (11:19 IST)

లేటు వయసులో ఘాటైన అందాల ఆరబోత

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో మలైకా అరోరా. చిత్రసీమలో బెస్ట్ ఐటమ్ గర్ల్‌గా గుర్తింపు పొందింది. ముఖ్యంగా, బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ నటించిన దిల్ సే చిత్రంలో చయ్య.. చయ్య అనే పాటకు ఆమె చేసిన డ్యాన్స్ దేశం యావత్తూ మెస్మరైజ్ అయింది. 
 
ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటిస్తూ వచ్చింది. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఉన్నట్టుండి మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన మలైకా... తనకంటే చిన్నవాడైన కుర్ర హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తోంది.
 
వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోనుంది. ఇదిలావుంటే ఈ అమ్మడు లేటు వయసులో మత్కెక్కించేలా తన అందాలను ఆరబోస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయగా అవి వైరల్ అయ్యాయి.