సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 29 మే 2019 (12:58 IST)

సెల్ఫీ పిచ్చోళ్ల చేతికి చిక్కిన మలైకా అరోరా...

బాలీవుడ్ నటి మలైకా అరోరా. ఈమె ఊహించని సంఘటన ఒకటి ఎదురైంది. ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లిన ఆమె సెల్ఫీ పిచ్చోళ్ళ చేతికి చిక్కింది. ఆమెను అనేక మంది సెల్ఫీపిచ్చోళ్లు చుట్టుముట్టారు. దీంతో వారి నుంచి బయటపడేందుకు విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయాన్ని గమనించిన ఆమె తండ్రి అనిల్ అరోరా ఒక్క పరుగున అక్కడకు చేరుకుని తన కుమార్తెను రక్షించాడు. 
 
తాజాగా జరిగిన ఈ సంఘటనతో మలైకా అరోరా అవాక్కయ్యారు. ముంబైలోని ఓ షాపింగ్ మాల్‌కు మలైకా తన తండ్రితో కలిసి వెళ్లింది. ఆ సమయంలో ఆమెను గుర్తించిన కొందరు యువకులు.. ఆమెతో కలిసి సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఒకరిద్దరికి ఆమె ఫోజులిస్తూ సెల్ఫీలు దిగింది.

ఆ తర్వాత ఉన్నట్టుండి అనేక మంది ఆమె చుట్టూ చేరిపోయారు. దీంతో వారి నుంచి తప్పించుకునేందుకు మలైకా అరోరా ఎంతగానో ప్రయత్నించి విఫలైంది. దీన్ని ఆమె తండ్రి గమనించి ఆ మూక నుంచి రక్షించి సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లారు. సెలబ్రిటీలకు ఈ తరహా సంఘటనలు ఎదురుకావడం ఇదేం కొత్తకాదు.