రజినీకాంత్ నటిస్తున్న వేట్టైయాన్ నుంచి ‘మనసిలాయో..’ లిరికల్ సాంగ్ రాబోతుంది
సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం వేట్టైయాన్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 10న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. సామాజిక పరమైన సమస్యలను తెలియజేసేలా సినిమాలు చేస్తూ విమర్శకులు ప్రశంసలను అందుకున్న దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ కాంబోలో రాబోతున్న ఈ పాన్ ఇండియ మూవీ ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. బ్లాక్ బస్టర్ చిత్రాలు 2.0, దర్బార్, లాల్ సలామ్ వంటి చిత్రాల తర్వాత రజినీకాంత్, లైకా ప్రొడక్షన్ష్ కలయికలో రాబోతున్న నాలుగో సినిమా వేట్టైయాన్.
వేట్టైయాన్ ప్రమోషన్స్‌లో వేగం పుంజుకుంది. అందులో భాగంగా ఈ సినిమా నుంచి తొలి పాటను మేకర్స్ విడుదల చేయటానికి సిద్ధమయ్యారు. పేట, దర్బార్, జైలర్ చిత్రాల తర్వాత రజినీకాంత్, రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ కలయికలోనూ రానున్న నాలుగో సినిమా కూడా ఇదే కావటం విశేషం. సూపర్ స్టార్ ఇమేజ్‌కు తగ్గట్టు ఆయన అభిమానులు సహా అందరినీ దృష్టిలో పెట్టుకుని అనిరుధ్ మరోసారి తనదైన పంథాలో బాణీలను అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి సెప్టెంబర్ 9న మనసిలాయో.. అనే పాటను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుషరా విజయన్, రోహిణి, అభిరామి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆడియెన్స్‌కు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వటానికి సిద్ధమవుతోన్న ఈ పాన్ ఇండియా సినిమా తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.