శనివారం, 18 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 డిశెంబరు 2024 (16:46 IST)

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

manchu nirmala
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ వివాదాన్ని పరిష్కరించేందుకు ఆయన భార్య మంచు నిర్మల రంగంలోకి దిగారు. మా ఇంట్లో మంచు మనోజ్ ఫిర్యాదులో నిజం లేదని, మంచు విష్ణు గొడవ చేయలేదని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా పహడి షరీఫ్ పోలీసులకు ఆమె ఓ లేఖ రాశారు. ఇంట్లో విష్ణు గొడవ చేసినట్టు జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పష్టత ఇచ్చారు. 
 
ఈ మేరకు ఆమె మంగళవారం పోలీసులకు రాసిన లేఖలో... ఈ నెల 14వ తేదీన నా పుట్టిన రోజు సందర్భంగా విష్ణు జల్‌పల్లిలోని మా ఇంటికి కేక్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేశాడని పేర్కొన్నారు. ఆ రోజు విష్ణు గొడవ చేశాడంటూ పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేసినట్టు తనకు తెలిసిందన్నారు. ఇందులో నిజం లేదని పేర్కొన్నారు. ఆ రోజున మంచు విష్ణు ఎలాంటి గొడవ చేయలేదన, బర్త్ డే సెలబ్రేషన్ తప్ గొడవ జరగలేదని చెప్పారు. 
 
ఇంటికి వచ్చి తన గదిలో ఉన్న వస్తువులను తీసుకుని, కాసేపు తనతో మాట్లాడి వెళ్ళాడని చెప్పారు. తమ ఇంటిపై మనోజ్‌కు ఎంత హక్కు ఉందో విష్ణుకు కూడా అంతే హక్కు ఉందని తెలిపారు. మనోజ్ ఫిర్యాదులో నిజం లేదని చెప్పారు. తాము ఇక్కడ పని చేయలేమని చెప్పి ఇంట్లో పని చేస్తున్న వాళ్లు మానేశారని, ఇందులో కూడా విష్ణు ప్రమేయం లేదని చెప్పారు.