మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 7 జనవరి 2020 (21:35 IST)

ఆ విషయంలో నన్ను నువ్వు ఫాలో అవద్దని ప్రధాని అన్నారు: మంచు విష్ణు

గతంలో బాలీవుడ్ ప్రముఖులతో ప్రధాని మోదీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి దక్షిణాది తారలను ప్రధాని ఆహ్వనించక పోవడంతో చిరంజీవి కోడలు ఉపాసన ట్విట్లర్లో మండిపడ్డారు. అయితే తాజాగా ప్రధాని మోదీని మోహన్ బాబు ఫ్యామిలీ  కలిసిన సందర్బంలో మంచు విష్ణు ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 
 
ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ తాను మోదీని బాలీవుడ్ నటులతో మీరు సమావేశం అయ్యారు, టాలీవుడ్ నటులతో ఎందుకు సమావేశం కాలేదు అని అడిగానని, అయితే దానికి ప్రధాని బాలీవుడ్ నటులతో కలవడం యాదృచ్చికంగా జరిగిందని చెప్పారన్నారు. అయితే టాలీవుడ్ నటులతో కలవడం అనేది కచ్చితంగా ప్లాన్ చేసుకుని కలుస్తాను అని చెప్పారు అన్నారు విష్ణు.
 
అయితే ఈ విషయంపై నేను ఎవరితో టచ్‌లో ఉండాలి అని అడిగితే నువ్వు ఫాలో అవద్దు నేను ఫాలో అవుతానని ప్రధాని చెప్పారని మీడియా సమావేశంలో తెలియజేశారు మంచు విష్ణు.