ఓట‌ర్‌ని కాదు ఓన‌ర్ అంటున్న‌విష్ణు

manchu vishnu
శ్రీ| Last Modified శుక్రవారం, 15 మార్చి 2019 (21:50 IST)
మంచు విష్ణు న‌టించిన లేటెస్ట్ మూవీ ఓట‌ర్. జి.ఎస్. కార్తీక్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రాన్ని జాన్‌సుధీర్ పూదోట నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. సుర‌భి హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఎస్‌.ఎస్. త‌మ‌న్ సంగీత సార‌థ్యం వ‌హిస్తుండగా రాజేష్ యాద‌వ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. సంప‌త్‌రాజ్‌, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముళి, ప్ర‌గ‌తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఇక టీజ‌ర్ విష‌యానికి వ‌స్తే.. అహింస మార్గం ద్వారా ఒక్క బుల్లెట్‌ కూడా కాల్చకుండా స్వాతంత్ర్యం తెచ్చుకున్న దేశం మనది. మనం పేదరికంపై పోరాటం చేశాం కానీ పేదలపై పోరాటం చేయలేదు. మార్పు మనలో రావాలి.. మారాలి.. మార్చాలి’ అని విష్ణు చెబుతున్న డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది.

‘నువ్వు ఆఫ్ట్రాల్‌ ఒక ఓటర్’ అని ప్ర‌తినాయ‌కుడు అంటే.. ‘నేను ఆఫ్ట్రాల్‌ ఒక ఓటర్‌ను కాను ఓనర్‌..’ అని విష్ణు చెబుతున్న డైలాగ్‌ టీజర్‌లో వినిపించింది. దాన్ని బ‌ట్టి.. ఈ సినిమా శైలి ఎలా ఉండ‌బోతోందో అర్థం చేసుకోవొచ్చు. ఏప్రిల్ లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. మ‌రి...ఈ సినిమా అయినా విష్ణుకి విజ‌యాన్ని అందిస్తుందో లేదో..?దీనిపై మరింత చదవండి :