మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 16 మార్చి 2023 (16:24 IST)

రంగమార్తాండ చూశాక బోరున ఏడ్చిన మంగ్లీ

Mangli, Krishna Vamsi
Mangli, Krishna Vamsi
గాయని మంగ్లీ ఈరోజే కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన రంగమార్తాండ సినిమాను తిలకించింది. బయటకు వస్తూ ఏడ్చేసింది. కళ్ళవెంట నీరు ఆపుకోలేకపోయింది. ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగిన మహిళల కోసం ప్రత్యేకంగా వేసిన ప్రివ్యూను ఆమె తిలకించింది. ఆమెతోపాటు జయసుధ, జయప్రద మరికొంతమంది నటీమణులు చూశారు. అందరికంటే మంగ్లీ బాగా కనెక్ట్‌ అయింది. దర్శకుడు కృష్ణవంశీతో సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని కూలంకషంగా వివరించింది.
 
మీ మార్క్‌ మరోసారి చూపించారు. నేను అమ్మ నాన్న దగ్గరనే వుంటాను. తల్లిని మించిన దైవం లేదు. ఈ సినిమాలో ప్రకాష్‌ రాజ్‌ పాత్ర జీవించేశారు. ఆయన నటన హైలైట్‌. మా అమ్మా నాన్న కథలా ఈ సినిమా అనిపించింది. మనిషికి ఎంత డబ్బు వున్నా దూరంగా వుండి తల్లిదండ్రులకు ఎంత చేసినా వారికి దగ్గరగా వుంటూ అవసానదశలో ధైర్యంగా వుండడమే మనిషి జీవితానికి పరమార్థం అంటూ తెలిపింది.