శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : గురువారం, 11 మే 2017 (14:33 IST)

హీరోయిన్లను నగ్నంగా చూసేందుకు వస్తున్నారనుకుంటున్నారా?: హీరోయిన్ మంజిమ

హీరోహీరోయిన్లకు ఫ్యాన్ క్లబ్ ఇప్పుడు చాలా పెద్ద సంఖ్యలోనే వుంటోంది. ఫ్యాన్స్ లేవనెత్తే ప్రశ్నలకు నటీనటులు సమాధానాలిస్తుంటారు. ఈ క్రమంలో 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రంలో నటించిన హీరోయిన్ మంజిమా మోహన్‌కు

హీరోహీరోయిన్లకు ఫ్యాన్ క్లబ్ ఇప్పుడు చాలా పెద్ద సంఖ్యలోనే వుంటోంది. ఫ్యాన్స్ లేవనెత్తే ప్రశ్నలకు నటీనటులు సమాధానాలిస్తుంటారు. ఈ క్రమంలో 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రంలో నటించిన హీరోయిన్ మంజిమా మోహన్‌కు ఓ అభిమాని ట్విట్టర్లో ఓ అభిప్రాయాన్ని పోస్టు చేశాడు.
 
సినిమాల్లో కురచ దుస్తులు వేసుకుని నటించే హీరోయిన్లను చూసేందుకు ప్రేక్షకులు వస్తున్నారంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై నటి మంజిమ అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్విట్టర్లోనే తన అభిమానికి ఇలా రీ-ట్వీట్ చేసింద. హీరోయిన్లు నగ్నంగా వుంటే చూడాలని మీరు అనుకుంటున్న అభిప్రాయం తప్పని స్పష్టీకరించారు. మంచి సినిమాలు చూసేందుకే వారు సినిమాలకు వస్తుంటారంటూ వ్యాఖ్యానించారు.