శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 సెప్టెంబరు 2020 (14:56 IST)

గంజాయి కూడా తులసి మొక్కలాంటిదే... చట్టబద్ధత చేయండి.. హీరోయిన్ డిమాండ్

భారతీయ సినీ పరిశ్రమలో డ్రగ్స్ కలకలం రేపుతోంది. ఇప్పటికే బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు డ్రగ్స్‌‌కే బలైనట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో ఆయన ప్రియురాలు, బాలీవుడ్ నటి రియా చక్రవర్తి ప్రధాన నిందితురాలిగా ఉంది. ఇప్పటికే ఆమె సోదరుడు సౌకి చక్రవర్తిని అరెస్టు చేశారు. అలాగే, ఈ కేసులో మ‌రికొంత మంది పాత్ర కూడా బ‌య‌ట‌ప‌డే అవకాశం ఉంది.
 
అదేసమయంలో క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ‌లో రాగిణి ద్వివేదిని ఇప్ప‌టికే అరెస్టు చేసిన అధికారులు ఆమెను విచారిస్తున్నారు. ఇందులో కీల‌క స‌మాచారం బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంది. ఈ క్రమంలో, ఆమెకు మ‌ద్ద‌తు ఇస్తూ క‌న్న‌డ న‌టి నివేదిత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. గంజాయి చాలా మంచిద‌ని, స్పష్టంగా చెప్పాలంటే గంజాయి మొక్క కూడా తులసి మొక్కవంటిదని చెప్పుకొచ్చింది. 
 
గంజాయిని మ‌న‌దేశంలో చ‌ట్టబద్ధం చేయాలని ఆమె వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. గంజాయి తుల‌సి మొక్క‌లాంటిదేన‌ని, దాన్ని బ్యాన్ చేయడానికి ముందు అది ఆయుర్వేదానికి వెన్నెముకలా ఉండేదని ఆమె చెప్పింది. అయితే, ఆమె చేసిన వ్యాఖ్య‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.
 
హిందువులు ప‌విత్రంగా భావించే తుల‌సిని గంజాయితో పోల్చ‌డంపై సోష‌ల్ మీడియాలోనూ నెటిజ‌న్లు విరుచుకుప‌డుతున్నారు. ఆమెకు గంజాయి అల‌వాటు ఉంద‌ని, అందుకే ఆమె ఇటువంటి మాట‌లు మాట్లాడుతోంద‌ని అంటున్నారు.