గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 30 మార్చి 2022 (17:22 IST)

చెన్నైలో చ‌ల‌న‌చిత్ర సౌత్ రీజన్ ఆధ్వ‌ర్యంలో మీడియా స‌మిట్‌

Chennai Sumit
క‌రోనా త‌ర్వాత చ‌ల‌న‌చిత్ర‌రంగంలో ద‌క్షిణాదిలో సినీరంగంపై పెద్ద ప్ర‌భావం చూపింది. ఇందుకు సంబంధించిన చెన్నై వేదిక‌గా చెన్నై ట్రేడ్ సెంటర్‌లో ఏప్రిల్ 9, 10 తేదీలలో సౌత్ ఇండియా మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ సమ్మిట్ ను జరుపుతోంది. దీనికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ ముఖ్యఅతిథిగా విచ్చేయ‌నున్నారు. ఇందుకు సంబంధించిన బ్రోచ‌ర్‌ను విడుద‌ల చేశారు. 
 
ఇందులో  భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా మహోత్సవ్’ పేరుతో వివిధ రంగాలలో పలు కార్యక్రమాలు జరుపుతున్నారు. అందులో భాగంగా కాన్ఫెడరేషన్ ఆఫ్‌ ఇండియన్ ఇండస్ట్రీ (సౌత్ రీజన్) సైతం ఓ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. 
 
ఈ స‌మావేశంలో పేరు పొందిన సినీ రంగ కళాకారులు, సాంకేతిక నిపుణులు పాల్గొనబోతున్నారు. మణిరత్నం, ఎ. ఆర్. రెహ్మాన్, తాప్సీ, ‘జయం’ రవి, శివరాజ్ కుమార్, ఫహద్ ఫాజిల్‌, సాబు శిరిల్‌, కార్తీక్ సుబ్బరాజు, పవన్ కుమార్, రీమా కళింగల్ తదితరులు ఈ సమ్మిట్ కు హాజరవుతున్నారు. తెలుగు నుండి రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలలో పాల్గొనబోతున్నారు. పాన్ ఇండియా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన దక్షిణాది చిత్రసీమకు సంబంధించిన కీలక విషయాలను ఈ సమావేశంలో చర్చిస్తారు. అలానే ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా, ఓటీటీ రంగాల ప్రభావం సినిమా రంగం మీద ఎలా ఉందనే దానిపై కూడా విస్తృత స్థాయిలో చర్చింబోతున్నారు.