శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 3 ఏప్రియల్ 2019 (15:58 IST)

మహేష్ బాబుతో మళ్లీ రొమాన్స్ చేస్తున్న 'దూకుడు' భామ..

ప్రస్తుతం టాలీవుడ్‌లో సూపర్‌స్టార్ మహేష్‌ బాబు టాప్ గేర్‌లో ఉన్నాడు. అతడితో నటించేందుకు హీరోయిన్‌లు తెగ ఆరాటపడుతుంటారు. ఒక్క సినిమాలోనైనా అతనితో ఆడిపాడాలని కలలు కంటారు. అదే రెండుసార్లు వస్తే, ఎగిరి గంతులు వేస్తారు. అలాంటిదే ఇప్పుడు జరిగింది. తాజాగా మహేష్ నటిస్తున్న 'మహర్షి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. 
 
వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్‌లో 25వ చిత్రంగా మే 9న విడుదల కానుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో మీనాక్షి దీక్షిత్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతోంది అనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఈ మీనాక్షి దీక్షిత్ ఎవరు అంటే గతంలో మహేష్ బాబు నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా 'దూకుడు'లో టైటిల్ సాంగ్‌లో మెరిసింది ఈ భామే.
 
తాజాగా 'మహర్షి' సినిమాలో అమెరికాలో మహేష్‌బాబు కొలీగ్ పాత్రలో కనిపించబోతోంది అని వార్తలు బయటకు వస్తున్నాయి. అంతేకాక మహేష్‌కి మీనాక్షికి మధ్య రొమాన్స్ కూడా ఉండబోతోందని, అది ఏ రేంజ్‌లో ఉండబోతోందో తెలియాలంటే సినిమా చూడాల్సిందేనని ఫిల్మ్ నగర్‌లో పుకార్లు వినిపిస్తున్నాయి. 
 
మహేష్ బాబుతో పనిచేయడం సూపర్ ఎక్స్‌పీరియన్స్ అని, మహేష్ బాబు ప్రొఫెషనలిజంకి మారుపేరు అని చెప్పుకొచ్చింది మీనాక్షి. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.