ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 9 జులై 2023 (17:51 IST)

ఆ ఒక్క కారణం కోసమే బ్రేక్ తీసుకున్నా : మీరా జాస్మిన్

meera jasmine
వ్యక్తిగతంగా తనను తాను మెరుగుపరుచుకునేందుకే కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్నట్టు నటి మీరా జాస్మిన్ అన్నారు. కెరీర్‌ ప్రారంభంలో అత్యధికంగా ఒక ఏడాదిలో ఎనిమిది చిత్రాల్లో నటించి, మెప్పించిన హీరోయిన్‌ మీరా జాస్మిన్‌... 2010 వరకు అదే స్థాయి జోరు సాగించారు. ఆమె సినిమాల సంఖ్య తర్వాతర్వాత తగ్గిపోయింది. కోలీవుడ్‌కు దూరమై సుమారు 9 ఏళ్లు గడిచింది. 
 
'టెస్ట్‌'తో మీరా అక్కడ రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సందర్భంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తానెందుకు నటనకు దూరంకావాల్సి వచ్చిందో తెలిపింది. 'నటిగా ఇప్పటివరకు అద్భుతమైన ప్రయాణాన్ని సాగించా. హీరోయిన్‌గా ఆదరణ పొందడాన్ని గౌరవంగా భావిస్తున్నా. వ్యక్తిగతంగా నన్ను నేను మెరుగుపరుచుకునేందుకు కొన్నాళ్లు బ్రేక్‌ తీసుకున్నా. ఇటీవల కొన్ని సినిమాల్లో నటిస్తున్న సమయంలో నా జర్నీ అప్పుడే ప్రారంభమైనట్టు అనిపించింది' అని పేర్కొంది.
 
'టెస్ట్‌' గురించి మాట్లాడుతూ.. 'మాధవన్‌, సిద్ధార్థ్‌లతో మరోసారి కలిసి పనిచేస్తుండడం ఆనందంగా ఉంది. నయనతారతో కలిసి తొలిసారి తెరను పంచుకోవడం గొప్ప అనుభూతి. దర్శకుడు శశికాంత్‌ ఈ సినిమా కథ వినిపించిన వెంటనే నటించేందుకు అంగీకరించా' అని మీరా తెలిపింది.