శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 జులై 2020 (14:41 IST)

ఆ వీడియోలో త్రిష బాగోతమంతా ఉంది... త్వరలో రిలీజ్ : మీరా మిథున్

కోలీవుడ్ నటీమణుల్లో మీరా మిథున్ ఒకరు. అలాగే, ఇదే చిత్ర పరిశ్రమకు చెందిన త్రిష కూడా ఓ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ముఖ్యంగా, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఆమె హీరోయిన్‌గా రాణించింది. అయితే, ఈమెకు ఉన్న వివాదాలు తక్కువేం కాదు. పైగా, మీరా మిథున్‌తో ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి. అందుకే తనకు ఛాన్స్ లభించినపుడల్లా మీరా మిథున్ ఏదో ఒక రూపంలో త్రిష‌ను కామెంట్ చేస్తుంది. 
 
త‌మిళ బిగ్‌బాస్‌లో సీజ‌న్ 3 కంటెస్టెంట్‌గానూ మీరా మిథున్ పాల్గొన్నారు. త్రిష‌కు కోలీవుడ్ మాఫియాతో సంబంధాలున్నాయ‌ని, నెపోటిజంకు త్రిష మ‌ద్ద‌తు ఇస్తోందని మీరా మిథున్ ఆరోపించారు. 
 
చిన్న చిన్న పాత్ర‌లు చేసి త‌ర్వాత హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న త్రిష త‌న‌కు న‌టిగా అవ‌కాశాలు లేకుండా చేస్తుంద‌ని మీరా మిథున్ కామెంట్స్ చేసింది. రీసెంట్‌గా త్రిష‌కు సంబంధించిన వీడియో ఒక‌టి విడుద‌ల చేస్తాన‌ని మీరా మిథున్ ట్విట్ట‌ర్‌లో చెప్ప‌డం హాట్ టాపిక్‌గా మారింది.