శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 13 మార్చి 2021 (09:35 IST)

ఘనంగా టాలీవుడ్ నటి మెహ్రీన్ నిశ్చితార్థం

టాలీవుడ్ నటి మెహ్రీన్ పిర్జాదా, రాజకీయ నాయకుడు భవ్యా బిష్ణోయ్‌ల నిశ్చితార్థం శుక్రవారం నాడు బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ జంట జైపూర్‌ను తమ వివాహ వేదికగా ఎంచుకున్నారు. మెహ్రీన్ సోదరుడు గుర్ఫతే సింగ్ పిర్జాదా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నిశ్చితార్థ ఫోటోలను షేర్ చేసాడు.
 
ఇదిలావుంటే మెహ్రీన్ ప్రస్తుతం F3 చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన గతంలో F2లో నటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాదిలోనే వివాహం కూడా జరగనున్నట్లు తెలుస్తోంది.