బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 8 జులై 2023 (17:34 IST)

నా.. నీ ప్రేమ కథ టీజర్ లాంచ్ చేసిన మంత్రి హరీష్ రావు

Amuda Srinivas Karunya Chaudhary,
Amuda Srinivas Karunya Chaudhary,
అముద శ్రీనివాస్ కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నా.. నీ ప్రేమ కథ’. కారుణ్య చౌదరి కథానాయిక. పోత్నాక్ శ్రవణ్ కుమార్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై పోత్నాక్ శ్రవణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్ ని తెలంగాణ ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి హరీష్ రావు లాంచ్ చేశారు.
 
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..‘నా.. నీ ప్రేమ కథ’ చిత్రం టీజర్ అద్భుతంగా వుంది. హీరో, దర్శకుడు అముద శ్రీనివాస్ చక్కన్ని ప్రతిభ కనబరిచారు. ఈ టీజర్ ని చూస్తుంటే సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. సినిమాలో నటీనటులంతా మంచి ప్రతిభ కనబరిచారు. ఈ చిత్రంతో నిర్మాత పోత్నాక్ శ్రవణ్ కుమార్ కి మంచి లాభాలు రావాలి. హీరో, దర్శకుడు అముద శ్రీనివాస్ కి మంచి అవకాశాలు అందుకోవాలి. చిత్ర యూనిట్ అందరికీ శుభాభినందనాలు’’ తెలిపారు.
 
ఈ చిత్రానికి ఎంఎస్ కిరణ్ కుమార్ కెమరామెన్ గా పని చేస్తున్నారు. ఎంఎల్ పి రాజా సంగీతం సమకూరుస్తుండగా చిన్నా నేపధ్య సంగీతం అందిసస్తున్నారు. నందమూరి హరి ఎడిటర్ గా పని చేస్తున్నారు.
 
నటీనటులు :అముద శ్రీనివాస్ కారుణ్య చౌదరి, రమ్య, అజయ్ ఘోష్, షఫీ, అన్నపూర్ణమ్మ, ఫిష్ వెంకట్ జబర్ దస్త్ ఫణి, నాగిరెడ్డి. బస్ స్టాప్ కోటేశ్వర రావు, మాధవి, వేములూరి రాజశేఖర్, హరి తదితరులు