మంగళవారం, 4 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : మంగళవారం, 4 మార్చి 2025 (14:19 IST)

మిథున్ చక్రవర్తి లవ్ స్టొరీ బిగిన్స్ చిత్రం మొదలైంది

Mithun Chakraborty,  Varsha, Shweta
Mithun Chakraborty, Varsha, Shweta
21 ఏళ్ల మిథున్ చక్రవర్తి హీరో కమ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గా తమిళ - తెలుగు భాషల్లో "లవ్ స్టోరీ బిగిన్స్" చిత్రం మొదలైంది. వర్మ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై. ప్రేమలోని కొత్త కోణాన్ని సరికొత్తగా ఆవిష్కరిస్తూ  తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మిథున్ సరసన వర్ష - శ్వేత నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం హీరో-హీరోయిన్లపై చిత్రీకరించిన "వస్తావా" అనే గీతాన్ని హైద్రాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆవిష్కరించారు.

అమర్ గీత్ సంగీత సారధ్యంలో శివమణి రాసిన ఈ పాటను.. భవదాయిని నాగరాజ్, విద్యుత్ శ్రీనివాస్, థామస్ చిరమేల్ అలెగ్జాండర్ ఆలపించారు. ఇదే పాటను దుబాయి నుంచి కూడా విడుదల చేయడం విశేషం.
 
పాట విడుదల అనంతరం యువ సంచలనం మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ..."చిన్నప్పటినుంచి సినిమాలే లోకంగా పెరిగాను. సినిమాలే నా జీవితం అని ఫిక్సయిపోయాను. నా జీవితంలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా... బోలెడు వినోదానికి రవ్వంత సందేశం జోడించి రూపొందిస్తున్న "లవ్ స్టొరీ బిగిన్స్" ప్రేమ చిత్రాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తుంది" అన్నారు. "లవ్ స్టొరీ బిగిన్స్" చిత్రంలో నటించే అవకాశం లభించడం పట్ల హీరోయిన్లు వర్ష, శ్వేత హర్షం వ్యక్తం చేశారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు దుబాయిలో షూటింగ్ జరుపుకునే "లవ్ స్టొరీ బిగిన్స్" ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ.