గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2019 (11:18 IST)

మోహన్ లాల్ మహాభారతం ఆగిపోయింది.. ఎందుకని?

సుమారు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో తీయాలనుకున్న రందమూలం అనే సినిమాను రద్దు చేసారు. దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త బీఆర్ శెట్టి ఈ విషయాన్ని ధ్రవీకరించారు. మహాభారతం ఆధారంగా భారీ సినిమాను తెరకెక్కించాలని బీఆర్ శెట్టి ప్లాన్ చేసాడు. ఆ సినిమా ప్రాజెక్ట్‌కి సంబంధించిన పనులు రెండేళ్ల క్రితమే మొదలైయ్యాయి. 
 
ఈ సినిమాలో మలయాళ సూపర్‌స్టార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అయితే డైరెక్టర్ శ్రీకుమార్ మీనన్, రైటర్ ఎంటీ వాసుదేవన్ నాయర్ మధ్య తలెత్తిన సమస్యలు సద్దుమణగలేదని, అనుకున్న డెడ్‌లైన్ దాటడం వల్లే ఈ సినిమాను రద్దు చేస్తున్నట్లు బీఆర్ శెట్టి తెలిపారు. 
 
ఓ మంచి స్క్రిప్ట్ రైటర్ కోసం ఎదురుచూస్తున్నానని, మహాభారత్‌పై ఖచ్చితంగా సినిమా తీస్తానని, దీనికి తాను వెనుకడుగు వేయనని, మన చరిత్రను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయాలని ఉందని శెట్టి అన్నారు. రందమూలం చిత్రాన్ని సుమారు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో నిర్మించినట్లు 2016లో మోహన్‌లాల్ ప్రకటించారు. 
 
ఎంటీ వాసుదేవన్ నాయర్ నవల ఆధారంగా సినిమా నిర్మించాలనుకున్నారు. మొదటి భాగాన్ని 2020లో రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టును పక్కన పెట్టినట్లు తాజాగా నిర్మాత శెట్టి తెలిపారు.