శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 13 మే 2019 (18:44 IST)

అమ్మకు ఘోరమైన శిక్షను ఇచ్చేస్తా: శ్రీరెడ్డి ఎమోషనల్ ట్వీట్

టాలీవుడ్, కోలీవుడ్‌లలో కొందరు నటులు, దర్శకులు, నిర్మాతలపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ వచ్చిన శ్రీరెడ్డి.. తాజాగా మదర్స్ డేను పురస్కరించుకుని ఎమోషనల్ పోస్టు చేసింది. తన ఫేస్‌బుక్ పేజీలపై అమ్మపై ఎమోషనల్ పోస్టు చేసింది. అందులో తన అమ్మకు ఘోరమైన శిక్ష ఇచ్చేశానని బాధపడింది. 
 
ఆదివారం మదర్స్ డేను పురస్కరించుకుని అమ్మను తలచుకుంది. అమ్మగా ఎన్నో మంచి విషయాలు తనకు నేర్పించారు. అది చాలు మమ్మీ. తాను పెరుగుతూ వస్తున్నాను. అయితే తన అమ్మకు మాత్రం ఘోరమైన శిక్షను ఇచ్చాను. అమ్మలాంటి ప్రేమ మరెకెక్కడా దొరకదని.. ఐ లవ్ యూ అమ్మా.. అంటూ శ్రీరెడ్డి పోస్టు చేసింది.
 
''నాపై మీకు ప్రేమ వుంది. కానీ నా పుట్టుకను తలచి ఆవేదన చెందుతున్నా'' అని శ్రీరెడ్డి తెలిపింది. కూతురిగా అమ్మను ఎన్నో ఇబ్బందులకు గురిచేశానని.. మీరిచ్చిన శరీరం. మీరే నా ఊపిరిని తీసేయండి.. మీరు సంతోషంగా వుండాలని ఎఫ్‌బీలో శ్రీరెడ్డి పోస్టు చేసింది.