మీడియా వల్లే ప్రజారాజ్యం కొంప మునిగిపోయింది.. నాగబాబు
మీడియా, సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. మీడియా ఒక్కటే ప్రపంచంలో జరుగుతుందనేది ప్రజలకు ఇట్టే తెలియజేస్తుంది. మీడియా మంచి విషయాలను ప్రజలకు చేరవేస్తున్నాయి. కానీ కొన్ని మీడియా ఛానల్స్ ఎల్లో జర్నలిజానికి పాల్పడుతున్నాయనే వాదన వుంది. తాజాగా మీడియాపై మెగా బ్రదర్ నాగబాబు ఫైర్ అయ్యారు.
అసలే ఇప్పుడు టీవీ 9 రవిప్రకాశ్ ఇష్యూతో మీడియాపై ప్రజల్లో కూడా మంచి చర్చ జరుగుతుంది. ఇలాంటి సమయంలో నాగబాబు కూడా సంచలన వ్యాఖ్యలు చేసారు. యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమ కుటుంబానికి మీడియా చేసినంత అన్యాయం.. దుర్మార్గం ఇంకెవరూ చేయలేదని చెప్పాడు.
ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు చిరంజీవి రేంజ్ వేరు.. కానీ పార్టీ పెట్టిన తర్వాత ఆయన పరిస్థితికి కారణం మీడియా అని మీరు భావిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా నాగబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.
అప్పట్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండింటికి వత్తాసు పలికే ఛానెల్స్ ఉండటం.. కావాలనే చిరంజీవిపై దుర్మార్గం చేయడంతోనే ఆయనకు ఆ పరిస్థితి వచ్చిందని నాగబాబు తెలిపాడు. గతంలో కూడా చిరుకు మీడియా సపోర్ట్ లేదు కాబట్టే రాజకీయాల్లో ప్రభావం చూపించలేకపోయారని నాగబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.