శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 11 మే 2019 (11:34 IST)

వరుణ్ తేజ్ చిన్ననాటి ఫోటో వైరల్.. నాగబాబును చూస్తే విజయ్ దేవరకొండలా వున్నాడే?

సోషల్ మీడియాలో ప్రిన్స్ వరుణ్ తేజ్ చిన్ననాటి ఫోటో వైరల్ అవుతోంది. టాలీవుడ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుని.. వైవిధ్యభరితమైన రోల్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం వరుణ్ వాల్మీకి చిత్రంలో నటిస్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో తాజాగా వరుణ్ తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసిన ఓ ఫోటో వైరల్ అవుతోంది. తన తండ్రి నాగబాబు, పెదనాన్న చిరంజీవి, బాబాయ్ పవన్ కళ్యాణ్ తో కలసి ఉన్న ఫోటోని వరుణ్ అభిమానులతో పంచుకున్నాడు. ఇది వరుణ్ తేజ్ చిన్ననాటి ఫోటో. పాలబుగ్గల పిల్లాడిలా కనిపిస్తున్న వరుణ్ పవన్ కళ్యాణ్ భుజాలపై కనిపిస్తున్నాడు. 
 
పవన్ కళ్యాణ్ కు చెరోవైపు నాగబాబు, చిరంజీవి ఉన్నారు. నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తులతో ఉన్నా.. వారిని ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటా అని కామెంట్ పెట్టాడు. ఈ ఫొటోలో నాగబాబు గడ్డంతో వుండగా, చిరు హ్యాండ్సమ్ లుక్‌లో, పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్‌తో అదరగొడుతున్నాడు. 
 
అయితే ఈ ఫోటోలో నాగబాబును చూసినవారంతా అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండలా ఫేస్ కట్ వుందని అభిప్రాయపడుతున్నారు. నాగబాబు చిన్ననాటి ఫోటోకు విజయ్ దేవరకొండ ప్రస్తుత ఫోటో కాస్త మ్యాచ్ అవుతుందని చెప్తున్నారు.