ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 అక్టోబరు 2021 (19:11 IST)

నాగిని సీరియల్ ఫేమ్ మౌని రాయ్‌కి పెళ్లి.. ఇటలీలోనా? దుబాయ్‌లోనా?

Nagini
ప్రముఖ నటి, నాగిని సీరియల్ ఫేమ్ మౌని రాయ్ గురించి అందరికీ తెలిసిందే. నాగిని సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మౌని రాయ్ తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త అయినా సురజ్‌ నంబియార్‌ను వచ్చే ఏడాది జనవరిలో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
 
మౌని రాయ్ గతంలో అతనితో ప్రేమలో ఉందని వీరి గురించి పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఇతను దుబాయిలో ఉండటంచేత మౌనీ రాయ్ తరచు అక్కడికి వెళ్లి రావడం లాక్ డౌన్ సమయంలో దుబాయ్ లోనే ఉండిపోవడం వల్ల వీరిద్దరికీ పెళ్లి జరిగింది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.
 
అయితే తనపై వస్తున్న వార్తలను ఖండించిన మౌని రాయ్ వచ్చే ఏడాది జనవరిలో వివాహం చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే మౌని రాయ్ తల్లి సూరజ్ కుటుంబ సభ్యులను కలిసి వీరి పెళ్లి గురించి సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వీరు పెళ్లి వచ్చే ఏడాది జనవరి దుబాయ్ లేదా ఇటలీలో జరగనున్నట్లు తెలుస్తోంది.