సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: బుధవారం, 29 సెప్టెంబరు 2021 (21:26 IST)

ప్రియుడినే నమ్మింది, సర్వస్వం అర్పించిన తరువాత?

మూడేళ్లు గాఢంగా ప్రేమించింది. ప్రియుడికి సర్వస్వం సమర్పించింది. జీవితాంతం అతనితోనే కలిసి ఉంటానని అనుకుంది. ఇంట్లో తల్లిదండ్రులను ఒప్పించింది. అయితే ప్రియుడే మోసం చేస్తాడని ఊహించలేదు. అర్ధాంతరంగా తనువు చాలించింది.
 
పెద్దపల్లి జిల్లా ఓదెలకు చెందిన ప్రసన్న, సందీప్‌లు గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. సందీప్‌తో ఎంతో సఖ్యతగా ఉండేది ప్రసన్న. తన జీవితంలో ఇక మిగిలింది సందీప్ మాత్రమేనని భావించిన ప్రసన్న అతనికి సర్వస్వం అర్పించింది.
 
త్వరలోనే వివాహం జరుగుతుందని, జీవితమంతా హాయిగా ఉండవచ్చని భావించింది. కానీ ప్రియుడు మోసం చేసి మరదలితో నిశ్చితార్థం చేసుకోవడంతో ఆమె ఆవేదనకు గురైంది. తల్లిదండ్రులను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుందాం అనుకుంటే సందీప్ తనను మోసం చేయడాన్ని అసలు జీర్ణించుకోలేక పోయింది. సందీప్ లేని జీవితం వద్దనుకొని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రసన్న మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.