బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 జులై 2024 (19:34 IST)

డార్లింగ్ ప్రభాస్‌తో రొమాన్స్ చేయనున్న మృణాల్ ఠాకూర్?

mrunal thakur
ప్రభాస్ జోరు మీదున్నాడు. కల్కి 2898 AD గ్లోబల్ సక్సెస్ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. కల్కి అత్యధికంగా రూ. 1100 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ప్రస్తుతం డైరెక్టర్ హను రాఘవపూడితో కలసి అబ్బురపరిచే కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. 
 
ఈ భారీ అంచనాల ప్రాజెక్ట్ మాస్ అప్పీల్‌తో కూడిన అధునాతన పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనుంది. షూటింగ్ సెప్టెంబరు 2024లో ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి.
 
"హాయ్ నాన్న"లో నాని, "సీతారామంలో" దుల్కర్ సల్మాన్, "ది ఫ్యామిలీ స్టార్"లో విజయ్ దేవరకొండతో సహా ప్రముఖ దక్షిణాది నటులతో కలిసి నటించిన మృణాల్ కెరీర్‌లో మంచి పేరు కొట్టేసింది. 
 
తాజాగా డార్లింగ్ సరసన రొమాన్స్ చేసేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని.. మృణాల్ కెరీర్‌లో హిట్ ఖాయమని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.